Friday 28 April 2017

దేవుని రక్షణ ప్రణాళిక


1యోహాను 5:11-12 ఆ సాక్ష్యమేమనగా - దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను.ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.

 ఈ వాక్యభాగము దేవుడు మనకు నిత్యజీవము అనుగ్రహించాడు మరియు జీవము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే పొందగలమని వివరించుచున్నది. మరో మాటలో చెప్పాలంటే నిత్యజీవము పొందుకొనుటకు మార్గము దేవుని కుమారుని పొదుకొనుట మాత్రమే. ప్రశ్న ఏదనగా , ఏ విధముగా ఒక వ్యక్తి దేవుని కుమారుని పొందుకొనగలడు?

మానవునిసమస్య దేవునితోఎడబాటు

 యెషయా 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

 రోమీయులకు 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

 రోమీయులకు 5:8 ప్రకారము ,దేవుడు తన కుమారుని యొక్క మరణము ద్వారా తన ప్రేమను మనయెడల వెల్లడిపరచుచున్నాడు.

దేవుడు ఎందువలన మన కొరకు మరణిమచాల్సి వచ్చింది? ఎందుకనగా లేఖనముల ప్రకారము మనుష్యులందరూ పాపులే. ’పాపము’ అనగా అర్హతను కోల్పోవుట. బైబిల్ ఈ విధంగా ప్రకటించుచున్నది. " ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను (సంపూర్ణమైన పరిశుద్ధత) పొందలేక పోవుచున్నారు.(రోమీయులకు ౩:23) .
మరోవిధంగా ,మన పాపము మనలను సంపూర్ణమైన పరిశుద్ధుడైన (నీతిమంతుడైన మరియు న్యాయవంతుడైన) దేవుని నుండి ఎడబాటు చేయుచున్నది. కనుక దేవుడు పాపియైన మానవుని తీర్పు తీర్చవలసియున్నది.
 హబక్కూకు 1:13 నీ కనుదృష్టి దుష్ఠత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా!



నిష్ఫలమైనమనక్రియలు
 లేఖనములు బోధించునది ఏమనగా మనవుని మంచితనము, మానవుని కార్యములు ,మానవుని నైతికత లేక మతపరమైన కార్యములు ఎంతమాత్రమును అతనిని దేవుని చేత అంగీకరింపబడుటకు వుపయోగపడవు. లేక పరలోకమునకు చేర్చుటకు సాధ్యపడవు. నైతికమైన వ్యక్తి , మతపరమైన వ్యక్తి మరియు నైతిక విలువలు లేని వ్యక్తి మరియు మత సంబంధము కాని వ్యక్తి అందరూ ఒకే పడవలో ప్రయాణించుచున్నారు. వారందరూ దేవుని యొక్క పరిపూర్ణమైన నీతిని పొందలేక పోవుచున్నారు. రోమీయులకు 1:18-3:8 వరకు అనీతి గల వ్యక్తిని, నీతి గల వ్యక్తిని మరియు మతపరమైన వ్యక్తిని గూర్చి సంభాషిస్తూ అపొస్తులుడైన పౌలు ఈవిధంగా ప్రకటిస్తున్నాడు. "యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారు , " నీతిమంతుడు లేడు ,ఒక్కడును లేడు ’ (రోమా 3:9-10 ). దీనితో పాటు ఈ క్రింది లేఖన భాగములు ఈ విధముగా ప్రకటించుచున్నవి.

 ఎఫెసీయులకు 2:8-9 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు.దేవుని వరమే.

 తీతకు 3:5-7 నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆపరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను.

 రోమీయులకు 4:1-5 కాబట్టి శరీరము మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది ? అబ్రాహాము దేవుని నమ్మెను.అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయు వానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమొతునిగా తీర్చువానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

 
 మానవుని మంచితనము ఎంతైనప్పటికీ అది దేవుని మంచితనముతో సాటి కాదు. దేవుడు పరిపూర్ణమైన నీతిమంతుడు. అందుచేతనే హబక్కూకు 1:13 లొ దేవుడు పరిపూర్ణమైన నీతి లేని వారితో సహవాసము చేయడని తెలుపుచున్నది. మనము దేవునితో అంగీకరింపబడాలంటే దేవునితో సమానముగా వుండాలి. దేవుని ఎదుట మనము దిగంబరులముగా , నిస్సహాయులముగా ,నిరీక్షణ లేని వారముగా మనము నిలువబడుదము. మన జీవితములొని ఏ మంచితనము మనలను పరలోకము లేక నిత్యజీవమునకు పాత్రులనుగా చేయదు. దీనికి పరిష్కారము ఏమి?

 దేవునిపరిష్కారము

 దేవుడు పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగినవాడు మాత్రమే కాదుగాని ఆయన పరిపూర్ణమైన ప్రేమ మరియు నిండు కృప ,కనికరములు కలిగిన వాడైయున్నాడు. ఆయన యొక్క ప్రేమ మరియు కృప ద్వారా ఆయన మనలను నిరీక్షణ లేనివారిగా, జవాబు లేనివారిగా విడిచి పెట్టలేదు.

 రోమీయులకు 5:8 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరశద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

 ఇదే బైబిల్ ప్రకటించే శుభవార్త , సువార్త యొక్క సందేశం. దేవుడు తన స్వంత కుమారుని బహుమానముగా అనుగ్రహించాడు. ఆయన మనుష్యునిగా అవతరించి (దైవ-మానవుడు) , పాపరహితునిగా జీవించి, మన పాపముల నిమిత్తమై సిలువ మరణము పొంది , సమాధి నుండి పునరుత్థానుడై తిరిగి లేచి తాను దేవుని కుమారుడనని ఋజువుచేయుటేకాక అతని మరణము యొక్క విలువ మనకొరకు ,మనకు ప్రతిగా చెల్లించబడెనని తెలియజేయుచున్నది.

 రోమీయులకు 1:4 మృతులలోనుండి పునరుత్ధానుడైనందున పరిశుద్ధమైన అత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. రోమయులకు 4:2-5 అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని ఎంచబడదు. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.

 2కొరింథీ 5:21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాజేసెను.

 1పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ,అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడియు ,ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని కుమారుని మనము ఏవిధంగా పొందగలము? యేసు క్రీస్తు సిలువలో మనకొరకు చేసిన కార్యము ద్వారా , బైబిల్ చెప్పునదేమనగా "కుమారుని గలవాడు , జీవము గలవాడు". మనము కుమారుడైన యేసుక్రీస్తును ,వ్యక్తిగత విశ్వాసము ద్వారా , క్రీస్తు మన పాపముల కొరకై మరణించాడని నమ్ముట ద్వారా ఆయనను మన రక్షకునిగా స్వీకరించగలము.

 యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి ,అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి , దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

 యోహాను ౩:16-18 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను . కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను.

 దీని ప్రకారము మనమందరము దేవుని యొద్దకు ఒకే విధముగా రాగలము :
1.పాపిగా మన పాపములను గుర్తించుట ద్వారా
2.మన క్రియలు మనకు రక్షణ నివ్వలేవని గ్రహించుట ద్వారా
3. క్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే రక్షింపబడగలమని నమ్ముటద్వారా.

 నీవు క్రీస్తును నీ స్వంత రక్షకునిగా విశ్వసించి ఆయనను పొందాలనుకుంటే , నీవు క్రీస్తు నందలి నీ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచాలంటే , ఒక చిన్న ప్రార్ధన ద్వారా నిన్ను నీవు పాపిగా ఒప్పుకుంటూ ,అయన క్షమాపణను స్స్వీకరిస్తూ మరియు నీ రక్షణకై క్రీస్తు నందలి విశ్వాసముతో పొందవచ్చు. 

Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews