Monday 27 November 2023

Bible Quiz - Genesis 8

1. How many days and nights did the rain continue during the flood?

a) 40 b) 150 c) 7

2. What bird did Noah first send out from the ark to see if the waters had receded?

a) Dove b) Raven c) Sparrow

3. How many times did Noah send out the dove from the ark?

a) 1 b) 2 c) 3

4. When did the ark come to rest on the mountains of Ararat?

a) On the 40th day b) On the 150th day c) On the 7th day

5. What sign did God give as a covenant between Him and all living creatures after the flood?

a) A rainbow b) A dove c) A star

6. How long did Noah and his family remain in the ark after it came to rest on the mountains of Ararat?

a) 40 days b) 150 days c) 57 days

7. What did Noah do after leaving the ark to thank God?

a) Built an altar and offered sacrifices b) Planted a garden c) Built a new house

8. Which mountain range is mentioned as the resting place of the ark?

a) Mount Sinai b) Mountains of Ararat c) Mount Everest

9. How many people were saved on the ark according to Genesis chapter 8?

a) 2 b) 8 c) 12

10. What did the dove bring back to Noah the second time it was sent out?

a) A leaf from an olive tree b) A branch from a fig tree c) Nothing

Monday 20 November 2023

Bible Quiz - Genesis Chapter 7 ఆదికాండము 7

1. How old was Noah when the floodwaters came?
జలప్రళయము వచ్చినప్పుడు నోవహు వయసు ఎంత?

a) 500 years
500 సంవత్సరాలు
b) 600 years
600 సంవత్సరాలు
c) 700 years
700 సంవత్సరాలు

2. How many of each clean animal did Noah take on the ark?
పవిత్రమైన జంతువులలో ఎన్నిటిని నోవహు ఓడపై ఎక్కించాడు?

a) 2
b) 7
c) 14

3. How long did it rain during the flood?జలప్రళయము సమయంలో ఎంతసేపు వర్షం కురిసింది?

a) 20 days and 20 nights
20 పగళ్లు, 20 రాత్రులు
b) 40 days and 40 nights
40 పగళ్లు, 40 రాత్రులు
c) 50 days and 50 nights
50 పగళ్లు, 50 రాత్రులు

4. How many people were on the ark with Noah?
నోవహుతో పాటు ఓడలో ఎంతమంది ఉన్నారు?

a) 2
b) 8
c) 12

5. What was the purpose of the flood, according to Genesis chapter 7?
ఆదికాండము 7వ అధ్యాయము ప్రకారము జలప్రళయము యొక్క ఉద్దేశ్యము ఏమిటి?

a) To destroy all life on earth
భూమ్మీద ఉన్న సమస్త జీవరాశులను నాశనం చేయడం
b) To cleanse the land from sin
పాపం నుండి భూమిని రక్షించడం
c) To test Noah's faith
నోవహును పరీక్షించడం

6. How many days did the waters prevail on the earth during the flood?
జలప్రళయము సమయంలో భూమిపై నీరు ఎన్ని రోజులు ఉంది?

a) 40 days
b) 150 days
c) 365 days

7. How did Noah determine when it was safe to leave the ark?
ఓడను విడిచిపెట్టడ౦ ఎప్పుడు సురక్షితమో నోవహు ఎలా నిర్ణయి౦చాడు?

a) He saw a rainbow
ఇంద్రధనుస్సును చూశాడు
b) God told him
దేవుడు చెప్పాడు
c) He counted the days
రోజులు లెక్కించాడు

8. What did Noah send out to see if the waters had subsided?
జలాలు తగ్గిపోయాయో లేదో చూడడానికి నోవహు ఏమి పంపాడు?

a) A raven
కాకి
b) A dove
పావురం
c) A hawk
గద్ద

9. How long did Noah and his family stay on the ark?
నోవహు, ఆయన కుటు౦బ౦ ఓడలో ఎ౦తకాల౦ ఉన్నారు?

a) 40 days and 40 nights
40 పగళ్లు, 40 రాత్రులు
b) 150 days
150 దినాలు
c) 1 year and 10 days
ఒక సంవత్సరం 10 దినాలు

10. After leaving the ark, what did Noah do to show his gratitude to God?
ఓడను విడిచిపెట్టిన తర్వాత, నోవహు దేవునికి తన కృతజ్ఞతను చూపి౦చడానికి ఏమి చేశాడు?

a) Built an altar and offered sacrifices
బలిపీఠాన్ని నిర్మించి బలి అర్పించాడు
b) Planted a vineyard
ద్రాక్ష తోటను నాటాడు
c) Built a new house
ఒక గృహాన్ని నిర్మించాడు


Monday 13 November 2023

Bible Quiz - Genesis 6-9 ఆదికాండము 6-9

1. Who were the sons of God mentioned in Genesis 6:2?

ఆదికాండము 6:2లో చెప్పబడిన దేవుని కుమారులు ఎవరు?
Angels
దేవదూతలు
Human beings
మానవులు
Animals
జంతువులు

2. How long did God say there would be until the flood came in Genesis 6:3?

ఆదికాండము 6:3లో జలప్రళయం రావడానికి ఎన్ని స౦వత్సరాలు ఉంటాయని దేవుడు చెప్పాడు?
40 years
40 సంవత్సరాలు
100 years
100 సంవత్సరాలు
120 years
120 సంవత్సరాలు

3. What were the Nephilim in Genesis 6:4?

ఆదికా౦డము 6:4లోని నెఫిలీములు ఏవరు?
Giants
రాక్షసులు
Righteous people
నీతిమంతులు
Kings
రాజులు

4. Why did God decide to bring the flood upon the earth in Genesis 6:5-7?

ఆదికా౦డము 6:5-7లో దేవుడు భూమ్మీద జలప్రళయాన్ని తీసుకురావాలని ఎ౦దుకు నిర్ణయి౦చాడు?
Because humans were wicked and violent
మానవులు దుర్మార్గులు మరియు హింసాత్మకులుగా మారారు
Because there was too much rain
ఎక్కువ వర్షం కురిసింది
Because the animals were unhappy
జంతువులు అసంతృప్తిగా ఉన్నాయి

5. How did Noah find favor in the eyes of the Lord in Genesis 6:8?

ఆదికా౦డము 6:8లో నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహాన్ని ఎలా పొందాడు?
By building an ark
దేవునితో నడవడం ద్వారా
By being a perfect man
పరిపూర్ణమైన మనిషిగా ఉండటం ద్వారా
By walking with God
ఓడను నిర్మించడం ద్వారా

6. How many of each clean animal did God command Noah to take on the ark in Genesis 6:19-20?

ఆదికాండము 6:19-20లో ఎన్నేసి పవిత్ర జంతువులు ఓడను ఎక్కమని దేవుడు నోవహుకు ఆజ్ఞాపి౦చాడు?
Two
రెండు
Seven
ఏడు
Ten
పది

7. How long did it rain during the flood in Genesis 7:12?

ఆదికా౦డము 7:12లో జలప్రళయ౦ జరిగినప్పుడు ఎంతసేపు వర్షం కురిసింది?
40 days and 40 nights
40 పగళ్లు, 40 రాత్రులు
7 days
7 పగళ్లు
100 days
100 రోజులు

8. How many people, including Noah's family, were saved in the ark in Genesis 7:13?

ఆదికా౦డము 7:13లో నోవహు కుటు౦బ౦తో సహా ఎ౦తమ౦ది ఓడలో రక్షి౦చబడ్డారు?
1
1
8
8
100
100

9. What did the dove bring back to Noah when he sent it out from the ark in Genesis 8:11?

ఆదికాండము 8:11లో నోవహు ఓడనుండి పంపినప్పుడు పావురం ఏమి తిరిగి నోవహు వద్దకు తీసుకువచ్చింది? An olive leaf
ఒలీవ ఆకు A fish
చేప Nothing
ఏమీ తేలేదు

10. After the flood, what sign did God give as a covenant with Noah and all living creatures in Genesis 9:12-13?

జలప్రళయ౦ తర్వాత ఆదికా౦డము 9:12-13లో దేవుడు నోవహుతోను సమస్త జీవరాశులతోను నిబ౦ధనగా ఏ సంకేతాన్ని ఇచ్చాడు?
A rainbow
ఇంద్రధనుస్సు
A comet
తోకచుక్క
A thunderstorm
ఉరుములు

Saturday 11 November 2023

డేవిడ్ లివింగ్ స్టన్ (1813 -1873)



"భూలోకపు రాజు ఇచ్చే పనిని గౌరవంగా పరిగణిస్తే, పరలోకపు రాజు ఇచ్చే పనిని త్యాగంగా ఎలా పరిగణిస్తావు?"

చీకటి ఖండంలో క్రీస్తు వెలుగును నింపిన మహనీయుడు 


డేవిడ్ లివింగ్ స్టన్ 19 వ శతాబ్దానికి చెందిన స్కాటిష్ మిషనరీ, ఆఫ్రికా ఖండంలో అనేక ప్రదేశాలను కనుగొన్న అన్వేషకుడు మరియు వైద్యుడు. ఆఫ్రికా ఖండంలో బానిస వ్యాపారాన్ని రద్దు చేయటంలో, స్థానిక ఆఫ్రికన్ల హక్కులను కాపాడటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆఫ్రికాలో లివింగ్ స్టన్ యొక్క సాహసయాత్రలలో 1854 లో నైలు నది యొక్క మూలాన్ని కనుగొనే ప్రయత్నం, విక్టోరియా జలపాతం మరియు ఆఫ్రికా ఖండం లోని అనేక మారుమూల ప్రాంతాలను అన్వేషించడానికి ఆయన చేసిన ఇతర ప్రయాణాలు ఉన్నాయి. 


బాల్యం మరియు విద్యాభ్యాసం 

డేవిడ్ లివింగ్ స్టన్ 1813లో స్కాట్లాండ్ లోని బ్లాంటైర్(Blantyre) అనే పట్టణంలో జన్మించాడు. లివింగ్ స్టన్  తల్లిదండ్రులు నీల్ లివింగ్ స్టన్ మరియు ఆగ్నెస్. వీరు కార్మిక తరగతికి చెందినవారు. అతని తండ్రి టీ డీలర్ మరియు ఆదివారం పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. అతడు బైబిల్స్ మరియు క్రైస్తవ సాహిత్యాన్ని తన తీరిక సమయంలో పంచిపెట్టేవాడు. ఆయన వేదాంత శాస్రం మరియు మిషనరీ సంస్థల గురించిన పుస్తకాలను విస్తృతంగా చదివేవాడు. దీని ప్రభావంతో డేవిడ్ లివింగ్ స్టన్ బాల్యం నుండే ఆసక్తి గల పాఠకునిగా మారాడు. అతడు ప్రకృతి మరియు సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కూడా ఎక్కువగా చదివేవాడు. కాని సైన్స్ పుస్తకాలు క్రైస్తవ్యాన్ని అణగదొక్కుతాయని అతని తండ్రి భావించేవాడు. అతని తల్లి ఎంతో దైవ భక్తి కలిగిన స్త్రీ. ఎల్లప్పుడూ సౌమ్యత కలిగి సహనంతో ఉండేది. రెండు గదుల చిన్న యింటిలో ఏడుగురు కుటుంబ  సభ్యులతో ఉండే వారి గృహాన్ని ఆమె సమర్థవంతంగా నిర్వహించేది. 

డేవిడ్  స్థానిక ఐరిష్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.  తగినంత వయస్సు వచ్చిన వెంటనే   అతను కుటుంబ పోషణకు సహకరించవలసి వచ్చింది. పదేళ్ళ వయస్సులో పత్తిమిల్లులో ఉదయం ఆరు నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పనిచేసేవాడు. ఎనిమిది నుండి పది గంటల సమయంలో తెరచి ఉండే సాయంకాల పాఠశాలలో తన చదువును కొనసాగించాడు.  

పరిమిత ఆర్ధిక వనరులు ఉన్నప్పటికీ లివింగ్ స్టన్ తన విద్యను కొనసాగాలని నిశ్చయించుకున్నాడు. మెడిసన్ మరియు కెమిస్ట్రీని అభ్యసించడానికి గ్లాస్గో లోని ఆండర్సన్ కళాశాలలో చేరాడు. కాంగ్రిగేషనల్ చర్చి పాస్టరు మరియు బానిసత్వ వ్యతిరేకంగా ప్రచారం చేసే రిచర్డ్ వార్డ్ లా యొక్క వేదాంత ఉపన్యాసాలకు హాజరవుతూ గ్రీకు భాషను కూడా అభ్యసించాడు. లివింగ్ స్టన్ సైన్స్ మరియు మెడిసన్ లో మంచి గుర్తింపు పొందాడు. 1840 లో గ్లాస్గో లోని ఫిజీషియన్స్ మరియు సర్జన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ (రాయల్ కాలేజ్ ) లైసెన్స్ పొందాడు.


ఆఫికా దేశానికి మిషనరీగా పిలుపు 

అతడు తన బాల్యం నుండి చైనా దేశానికి మెడికల్ మిషనరీగా వెళ్ళాలనే ఆశయాన్ని కలిగి ఉండేవాడు. దేవుడు తనను నడిపించకున్నా తన స్వయం పోషణతో  చైనాదేశానికి వెళ్లాలని ఆశిస్తూ లండన్ మిషనరీ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. కాని ఆ సమయంలో ఇంగ్లండ్ మరియు చైనా దేశాల మధ్య యుద్ధం కారణంగా చైనా ద్వారాలు మూసి వేయబడ్డాయి. అదే సమయంలో ఆఫ్రికా దేశంలో మిషనరీ పరిచర్య చేస్తున్న మోఫాట్ అనే మిషనరీ పిలుపుకు స్పందించి అక్కడ సేవలో పాల్గొనడానికి 1840 డిసెంబర్ 8న బయలుదేరాడు.  3 నెలల నౌకా ప్రయాణంలో అతడు నావికా శాస్త్రాన్ని కెప్టెన్ ద్వారా తెలుసుకున్నాడు.  ఈ పరిజ్ఞానం అతనికి ముందు దినాలలో మధ్య ఆఫ్రికాను అన్వేషించుటలో ఎంతగానో సహాయపడింది. 

కేప్ టౌన్ నుండి 600 మైళ్ళ దూరంలో గల  రాబర్ట్ మోఫాట్ యొక్క ప్రఖ్యాత మిషనరీ స్థావరమైన కురుమాన్ కు చేరాడు. “ఉదయకాలం నేను నా యింటి వరండాలో నిలబడి ఉత్తరం వైపు చూసాను. యేసు క్రీస్తు గురించి ఎన్నడూ వినని వెయ్యి గ్రామాల నుండి తెల్లని పొగలు రావడం చూసాను. ఈ ప్రజలంతా క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా  ప్రపంచంలో నిరీక్షణ లేకుండా ఉన్నారు” అని డేవిడ్ తెలిపాడు. ‘క్రీస్తు లేని వెయ్యి గ్రామాల నుండి పొగ’ ఈ మాటలను లివింగ్ స్టన్ ఎన్నడూ మరువలేదు. అతడు  మిషనరీ స్థాపకుడైన రాబర్ట్ మోఫాట్ తో ఉత్తరాన ఉన్న ఈ వెయ్యి గ్రామాలను క్రీస్తు సువార్తతో సంధించాలనే  తన ఆశయాన్ని తెలియజేసాడు. అతని అంగీకారంతో 1843 లో తన ప్రయాణాన్ని కొనసాగించి మబోట్సా (Mabotsa) అనే లోయ ప్రదేశానికి చేరాడు.

అతని మిషనరీ ప్రయాణాలలో ఒకమారు సింహం యొక్క దాడి నుండి తృటిలోతప్పించుకున్నాడు. ప్రక్కనే ఉన్న మెబాల్వే (Mebalwe) స్థానిక ఉపాధ్యాయుడు రక్షించకుంటే అతను మరణించేవాడు. కాని అతని ఎడమ ముంజేయి తీవ్రంగా గాయపడి జీవితాంతము బాధించింది.


మేరి మోఫాట్ తో వివాహము మరియు కుటుంబంగా పరిచర్య  

మబోట్సా  ప్రాంతంలో పరిచర్యను విజయవంతంగా ముగించుకొని కురుమాన్ స్థావరానికి తిరిగివచ్చాడు డేవిడ్. అతడు సింహం దాడి యొక్క గాయాల నుండి కోలుకున్న పిమ్మట మేరీ మోఫాట్ తో అతని వివాహం జనవరి 9, 1845 లో జరిగింది. వారిరువురు మబోట్సా నందు ఒక సవత్సరం పాటు  సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడిపారు. ఆ తరువాత వారు కోలోబెంగ్ (Kolobeng) అను ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో గడిపిన దినాలు తన జీవితంలో ఆనందకరమైన క్షణాలుగా పేర్కొంటాడు కాని తన బిడ్డలతో ఎక్కువ సమయం గడపలేకపోయాననే వేదన అతనికి ఉండేది. ఆ ప్రాంతంలో ఉండే బక్వేయిన్స్ (Bakwains) జాతి నాయకుడు ‘సెచెలె’ క్రీస్తు సువార్తకు స్పందించాడు. “మీ పితరులు మా పితరుల వద్దకు వచ్చి ఈ సువార్తను ఎందుకు బోధించలేదు? ఈ సువార్తను ఎందుకు మీతోనే ఉంచుకున్నారు?” అని ప్రశ్నించాడు. అతడు క్రీస్తును తన స్వంత రక్షకునిగా స్వీకరించాడు. 

 వారు ఆ ప్రదేశం  విడచి కలహారి ఎడారికి ఉత్తరాన ఉన్నజాంబేజీ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ ప్రాంతం కేప్ టౌన్ కు దాదాపు 1500 మైళ్ళ దూరంలో ఉంది. ఆ తర్వాత లివింగ్ స్టన్ తన భార్య మరియు నలుగురు పిల్లలను స్కాట్లాండ్ కు పంపించాడు. 1852లో  లివింగ్ స్టన్ ఆఫ్రికా ఖండాన్ని అన్వేషించడానికి తన యాత్రను ప్రారంభించాడు. 


లివింగ్ స్టన్ యొక్క సాహసయాత్రలు మరియు అన్వేషణలు 


1851లో దక్షిణ ఆఫ్రికాలోని కలహరి ఎడారిని అన్వేషించి నగామి(Ngami) సరస్సును కనుగొన్నాడు. రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వారిచే అన్వేషకునిగా గుర్తించబడ్డాడు. 

1853లో ఎగువ జాంబేజీ నదిపై పరిశోధనకు నాయకత్వం వహించాడు. అక్కడ ఉన్న ఉన్న లిన్యాంటి గ్రామానికి  వెళ్ళాడు. ఇక్కడ ఉన్న కోలోలో జాతి నాయకుని సహాయంతో తీరానికి వాణిజ్య మార్గాలను పరిశోధిస్తూ పోర్చ్ గీస్ నగరం లువాండా చేరుకున్నాడు. 

1854లో  లిన్యాంటి గ్రామానికి తిరుగు ప్రయాణంలో మోసి-ఓ-తున్యా (ఉరుములు మెరుపుల పోగ) జలపాతాన్నికనుగొన్నాడు.

1855 లో విక్టోరియా జలపాతం కనుగొనడంతో సహా 1858-1864 లో అతను ప్రస్తుత జాంబియా, అంగోలా మరియు టాంజానియా ప్రాంతాన్ని అన్వేషించాడు. విక్టోరియా జలపాతాన్ని చూసిన మొదటి యూరోపియన్ లివింగ్ స్టన్, దానికి విక్టోరియా రాణి పేరు పెట్టాడు మరియు ఆఫ్రికా ఖండం యొక్క వెడల్పును దాటిన మొదటి వ్యక్తి కూడా లివింగ్ స్టన్.

1866-1873 లో  తన చివరి పరిశోధన యాత్రలు చేసాడు, పాశ్చాత్య భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన అనేక అన్వేషణలు చేశాడు. ఆఫ్రికా ఖండంలోని అనేక ప్రాంతాలను, నదులను కనుగొన్నాడు.

అతని సాహసాలు మరియు ఆవిష్కరణలకు లివింగ్ స్టన్ కు అనేక పతకాలు లభించాయి, వీటిలో 1857 లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఫౌండర్స్ గోల్డ్ మెడల్ మరియు 1864 లో రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ యొక్క బ్రూస్ మెడల్ ఉన్నాయి. అతను 1864 లో రాయల్ సొసైటీ ఫెలోగా కూడా నియమించబడ్డాడు.


డేవిడ్ లివింగ్ స్టన్ మరణం

డేవిడ్ లివింగ్ స్టన్ 60 సంవత్సరాల వయస్సులో  1873 మే 1 న ప్రస్తుత జాంబియాలోని బాంగ్ వేలు సరస్సుకి ఆగ్నేయంగా ఉన్న చిటంబో గ్రామంలో తన చివరి దినాలు గడిపాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మలేరియా మరియు అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడు. అతని నమ్మకమైన అనుచరులు చుమా మరియు సుపీ నేతృత్వంలో అంత్యక్రియలను జరిపించారు. వారు అతని గుండెను తీసివేసి అతడు మరణించిన ప్రదేశానికి సమీపాన గల చెట్టు క్రింద పాతిపెట్టారు. ఆ ప్రాంతం ప్రస్తుతం  లివింగ్ స్టన్ మెమోరియల్ స్థలముగా పిలువబడుచున్నది. అతని మృతదేహం మరియు ఆయన పుస్తకాలు , ఉపయోగించిన వస్తువులు బ్రిటన్ కు పంపారు. లండన్ లోని రాయల్ సొసైటీ  ప్రధాన కార్యాలంలో ఉంచబడిన పిమ్మట వెస్ట్ మినిస్టర్ అబ్బే లో ఖననం చేశారు. 


ముగింపు 

లివింగ్ స్టన్ రచనలు మరియు పత్రికలు బానిసత్వ నిర్మూలనకు మద్దతు నిచ్చాయి. ఆయన అన్వేషణలు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణపై గొప్ప ప్రభావం చూపింది. ఆఫ్రికన్లకు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ లభించడానికి అతని అన్వేషణలు తోడ్పడ్డాయి. ఆయన క్రైస్తవ మిషనరీలు అంకిత భావంతో పనిచేయడాన్ని ప్రోత్సహించాడు. అతను తన జర్నల్ లో ఇలా వ్రాశాడు –“ క్రీస్తు రాజ్యానికి సంబంధించి తప్ప,  నాకు కలిగి ఉన్న దేనికీ విలువ ఇవ్వను. ఏదైనా రాజ్యం యొక్క ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే , ఇవ్వడం లేదా ఉంచడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. నిత్యత్వంలో నేను నిరీక్షిస్తున్న రాజ్యం యొక్క కీర్తిని చాటడానికి నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను”. డేవిడ్ లివింగ్ స్టన్ జీవితం  ద్వారా ఉత్తేజితులై ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది యవ్వనులు మిషనరీలుగా క్రీస్తు సేవకు సమర్పించుకున్నారు. ఇంకనూ క్రీస్తును  ఎరుగని  ప్రాంతాలకు  వెళ్లి సువార్త ప్రకటించడానికి ఇదే మంచి తరుణం. ప్రయాస పడదాం, భూదిగంతాలకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ముందుకు కదులుదాం.


Monday 6 November 2023

Bible Quiz - Genesis 5 ఆదికాండము 5

1. Who was the father of Seth? షేతు తండ్రి ఎవరు?

A. Adam
ఆదాము
B. Cain
కయీను
C. Enoch
హనోకు
D. Methuselah
మెతూషెల

2. How old was Adam when he fathered Seth?

షేతుకు తండ్రి అయినప్పుడు ఆదాము వయస్సు ఎంత?
A. 105 years
105 సంవత్సరాలు
B. 130 years
130 సంవత్సరాలు
C. 235 years
235 సంవత్సరాలు
D. 800 years
800 సంవత్సరాలు

3. Who lived the longest in Genesis chapter 5?

ఆదికాండము 5వ అధ్యాయము ప్రకారం ఎక్కువ కాలం జీవించినది ఎవరు?
A. Adam
ఆదాము
B. Enoch
హనోకు
C. Lamech
లెమెకు
D. Methuselah
మెతూషెల

4. How old was Noah when he fathered Shem?

షేముకు తండ్రి అయినప్పుడు నోవహు వయస్సు ఎంత?
A. 105 years
105 సంవత్సరాలు
B. 130 years
130 సంవత్సరాలు
C. 235 years
235 సంవత్సరాలు
D. 500 years
500 సంవత్సరాలు

5. Who "walked with God" and was taken by God so that he did not die?

"దేవునితో నడిచి" చనిపోకుండా దేవునిచే తీసుకోబడినవాడు ఎవరు?
A. Adam
ఆదాము
B. Enoch
హనోకు
C. Lamech
లెమెకు
D. Methuselah
మెతూషెల

6. What is the total number of generations mentioned in Genesis chapter 5?

ఆదికాండము 5వ అధ్యాయములో పేర్కొన్న మొత్తం తరాల సంఖ్య ఎంత?
A. 7
7 తరాలు
B. 8
8 తరాలు
C. 9
9 తరాలు
D. 10
10 తరాలు

7. How many years did Enoch live after the birth of Methuselah?

మెతూషెల పుట్టిన తర్వాత హనోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు?
A. 65 years
65 సంవత్సరాలు
B. 300 years
300 సంవత్సరాలు
C. 360 years
360 సంవత్సరాలు
D. 365 years
365 సంవత్సరాలు

8. What was the primary purpose of the genealogy in Genesis chapter 5?

ఆదికాండము 5వ అధ్యాయములోని వంశావళి యొక్క ప్రాధమిక ఉద్దేశ్యము ఏమిటి?
A. To record the history of the earth
భూమి చరిత్రను నమోదు చేయడానికి
B. To trace the lineage of Jesus Christ
యేసుక్రీస్తు వంశాన్ని గుర్తించడానికి
C. To highlight the achievements of the patriarchs
పితృదేవతల విజయాలను హైలైట్ చేయడం
D. To predict the future of humanity
మానవాళి యొక్క భవిష్యత్తును అంచనా వేయడం

9. Who is mentioned as the father of all those who dwell in tents and have livestock?

గుడారాల్లో నివసిస్తూ పశుసంపద ఉన్న వారందరికీ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
A. Adam
ఆదాము
B. Enoch
హనోకు
C. Lamech
లెమెకు
D. Methuselah
మెతూషెల

10. In total, how many years did Methuselah live?

మెతూషెలఎన్ని సంవత్సరాలు జీవించాడు?
A. 365 years
365 సంవత్సరాలు
B. 600 years
600 సంవత్సరాలు
C. 969 years
969 సంవత్సరాలు
D. 1000 years
1000 సంవత్సరాలు

Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews