Saturday, 7 December 2024
Monday, 25 November 2024
జెఫన్యా - చీకటిలో వెలుగు
జెఫన్యా పరిచయం :
హెబ్రీ భాషలో జెఫన్యా అనే పేరుకు ‘ యెహోవా కాపాడతాడు ‘ అని అర్ధం. జెఫన్యా ఒక రాజకుటుంబం నుండి వచ్చాడు. జెఫన్యా 1:1 లో తన వంశవృక్షం లోని నాలుగు తరాల వారిని గూర్చి ప్రస్తావించాడు. యుదా రాజైన హిజ్కియా ( క్రీ.పూ 716 – 687) ముదిమనుమడు జెఫన్యా. ఇతనికి యెరూషలేములోని రాజమందిరపు అలవాట్లు, రాజకీయ వ్యవహారాలు అన్నీ సుపరిచితం. జెఫన్యా జీవించిన కాలంలోనే నహూము, యిర్మియా ప్రవక్తలు కుడా జీవించి ఉండవచ్చు.
జెఫన్యా నివసించిన కాలం :
రాజైన యోషీయా పరిపాలించిన కాలంలో క్రీ.పూ 640 – 609 సంవత్సరాలలో జెఫన్యా జీవించాడు. యూదాను పరిపాలించిన మంచి రాజులలో యోషీయా చివరివాడు. దేశాన్ని దేవుని వైపు త్రిప్పడానికి ఎన్నో బలమైన ప్రయత్నాలు చేశాడు. యోషీయా కాలంలోనే ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడింది. దానిని చదివిన యోషీయా అనేక సంస్కరణలకు పూనుకున్నాడు(2 రాజులు 22:1 – 23:25). అతడు చేసిన సంస్కరణలు జెఫన్యాను కూడా ప్రభావితం చేసివుండవచ్చు.
తన 8 వ ఏట యోషీయా రాజై, 31 సంవత్సరాలు యుదా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తల్లి యెదీదా. అతడు యెహోవా దృష్టికి యదార్ధముగా నడిచాడు. అతడు శిథిలమైన యెహోవా మందిరాన్ని బాగుచేయాలని తలంచాడు. ఆ సమయంలో ప్రధానయాజకుడైన హిల్కీయాకు ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. యోషీయా ఆ గ్రంథాన్ని చదివాడు. హుల్డా ప్రవక్తి సహాయంతో గ్రంథంలో చెప్పబడిన విషయాలను గ్రహించి ప్రజలకు వాటిని వివరించాడు. యెహోవా కట్టడలను హృదయపూర్వకంగా గైకొంటానని యెహోవా సన్నిధిలో వాగ్థానం చేశాడు. ఇతర దేవతలను నాశనము చేసి వాటిని పూజించడానికి ఉపయోగించిన ఉపకారణాలన్నిటినీ యెహోవా ఆలయములో నుండి తెచ్చి నాశనము చేశాడు. విగ్రహారాధనను సమూలంగా నిర్మూలించిన పిమ్మట ప్రజలందరూ పస్కా పండుగను ఆచరించాలని ఆజ్ఞాపించాడు. యోషీయా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ధర్మశాస్త్రము చొప్పున ప్రవరించాడు. యోషీయా ఐగుప్తు రాజైన ఫరో నెకో చేతిలో మెగిద్దో దగ్గర చంపబడ్డాడు. యోషీయా మరణానికి ముందే జెఫన్యాకు దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యింది. తాను యూదా మీదకు తేనున్న తీర్పును యెహోవా బయలుపరిచాడు.
జెఫన్యా కాలం నాటి పాపాలు :
1. ఏకీకరణ వాదము (జెఫన్యా 1:5 – 9) : ఇశ్రాయేలీయులు వాగ్థానభూమిని చేరిన తరువాత అక్కడ ఉన్న అన్యులందరిని వెళ్ళగొట్టాలని వారి దేవతలను పూజించరాదని యెహోవా దేవుడు వారిని ఆజ్ఞాపించాడు. కాని వారు కనానీయులు దేవతలను పూజించటం మొదలుపెట్టారు. వారి దేవతలలో ముఖ్యమైన బయలు దేవతను (సంతానోత్పత్తి కొరకు) వారు పూజించసాగారు. ఆకాశ సమూహాలకు మొక్కడం అలవాటు చేసుకున్నారు. నిర్గమకాండం 20::3 లో “ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ” అని యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను విస్మరించారు. యెహోవా దేవునితోపాటు అనేక దేవుళ్ళను మరియు దేవతలను పూజించసాగారు.
2. నిర్లక్ష్యము (1:12) : వారు దేవుని యెడల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. “ యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాదు” అని వారు తమ మనస్సులో అనుకొన్నారు.
3. బలాత్కారము / మోసము (1:8) : యూదా అధికారులు, రాజకుమారులు ఇతర దేశాల వస్త్రధారణను అనుకరిస్తూ , ప్రజలపట్ల మోసముతో, బలాత్కారముతో వారిని దోచుకోసాగారు.
4. ధనాశ (1:11,13) : వారు ద్రవ్యమును సమకూర్చుకొనుటకును, ఇండ్లు, ఆస్తులు కూడబెట్టుటయందును, ద్రాక్షతోటలు నాటించుటయందును నిమగ్నమై వున్నారు. వారి కొరకు వెండి, బంగారములను సమకూర్చుకున్నారు.
జెఫన్యా సందేశం :
జెఫన్యా సందేశాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు.
1. దేవుని తీర్పు
ఎ) యూదా మీదకు రానున్న తీర్పు (1:1 - 2:6)
బి) అందరి మీదకు రానున్న తీర్పు (2:4 -3:13)
2. దేవుని వాగ్థానము (3:14 – 20)
దేవుని తీర్పు:
యెహోవా వాక్కు జెఫన్యాకు ప్రత్యక్షమయ్యింది . యూదా ప్రజలకు తాను ఎటువంటి కఠినమైన తీర్పును ఇవ్వబోతున్నాడో యెహోవా దేవుడు వివరించాడు – ఏమియు విడువకుండ సమస్తాన్ని ఊడ్చివేసెదను (1:2) అని సెలవిచ్చాడు. భూమి మీద ఎవరును లేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను (1:3), బయలు దేవత యొక్క భక్తులను, ఆకాశ సమూహములకు మొక్కేవారిని (1:4), యెహోవా వద్ద విచారణ చేయనివారిని (1:5), అన్యదేసస్థుల వలె వస్త్రధారణ చేసుకునే వారిని (1:8), యజమాని ఇంటిని మోసముతోను, బలాత్కారముతోను నింపేవారిని (1:9) సమూలంగా నిర్మూలిస్తానని యుదా ప్రజలకు తన తీర్పును ప్రకటించాడు దేవుడైన యెహోవా.
కేవలము యూదా ప్రజల మీదనే కాకుండా అందరి మీదకు రానున్న తీర్పును జెఫన్యాకు తెలియజేయబడింది. గాజా, ఆష్కేలోను, అష్టోదు, ఎక్రోను మొదలగు ఫిలిష్తీయుల ప్రముఖ పట్టణాలను, మోయాబీయులను, అమ్మోనీయులను, కూషీయులను, అష్షూరీయుల దేశాన్ని మరియు వారి ముఖ్య పట్టణమైన నీనెవె ను నాశనం చేస్తానని అక్కడి అధిపతులు, ప్రవక్తలు, యాజకులు అందరూ నిర్మూలించబడతారని యెహోవా సెలవిచ్చాడు.
దేవుని వాగ్థానము :
జెఫన్యా (3:14 -20) యెహోవా వాగ్దానం చేసిన ఉత్సవదినం గురించి వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి మధ్య ఉంటాడు (1:15), యెహోవా వారిని అన్ని అపాయముల నుండి రక్షిస్తాడు(1:17), ఆయన వారి పట్ల సంతోషిస్తాడు,హర్షిస్తాడు, ప్రేమ కలిగి ఉంటాడు(1:18). యూదాలో మాత్రమే కాక సర్వలోకం లోనూ కుంటివారి పట్ల, చెదిరిపోయిన వారి పట్ల యెహోవా ఆసక్తి చూపుతాడు (1:19). దేవుని భవిష్యత్ పాలనకు ఇది ఒక సూచన. కుంటివారు, బహిష్కృతులు,పేదలు దేవుని రాజ్యంలో ఉంటారు.
దేవుని ప్రజలకు జెఫన్యా పిలుపు :
1. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి (1:7) : మౌనము ఒక్కోసారి మనము చేసిన తప్పును అంగీకరించడాన్ని సూచిస్తుంది. కాని దేవుని సన్నిధిలో మౌనముగా నుండుట ఆయన యందలి భక్తిని తెలియజేస్తుంది. దేవుడు తీర్పు తీర్చు దినము రావలసియున్నది నీతిమంతులు ఆ దినము కొరకు మౌనముగా ఎదురుచూడాలి.
2. యెహోవాను వెదకుడి (2:3) : మనము దేవుని సన్నిధిలో ఆయనను కలుసుకొనబోవుచున్నాము. రోమా(3:9-20) లో కుడా జెఫన్యా వివరించిన తీర్పును చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువు మన పాపము నిమిత్తమై మనకు బదులుగా ఆ తీర్పును పొందియున్నాడు. ఆయనను నమ్ముటవలన మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడతాము.
3. యెహోవా దినము కొరకు కనిపెట్టి యుండుడి (3:8) : ప్రభువు దినము సమీపముగా ఉన్నది 2 పేతురు 3:12 లో కుడా ప్రభువు దినము కొరకు మనము కనిపెట్టవలసిన ఆవశ్యకతను తెలియజీస్తున్నది. పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరించబడుచున్నాము.
4. జయధ్వని చేయుడి....పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి (3:14) : జెఫన్యా తన ప్రవచనాన్ని ఆయన ప్రజలందరూ దేవుని ఆరాధించాలానే పిలుపుతో ముగిస్తున్నాడు. రాబోయే దినములలో కాదుగాని ప్రస్తుతము ఉన్న స్థితిలోనే మనము దేవుని ఆరాధించేవారముగా ఉండాలి. ఎందుకనగా తీర్పుదినము తథ్యము. దేవుని ప్రజలకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు తప్పకుండా అందుతాయి. దేవుని ప్రజలు విశ్వాసముతో, వాగ్ధానము చేసిన దేవుడు నమ్మదగినవాడు అని ఆయనను ఆరాధించాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా నీతిమంతుల భవిష్యత్తు ఆయందు భద్రపరచబడి యున్నది.
ముగింపు :
జెఫన్యా ప్రవచనం క్రీ.పూ 586 లో బబులోను వారు యెరూషలేమును నాశనం చేయుటతో నెరవేరింది. అయితే 3:18 – 20 లోని నిరీక్షణ సందేశం వాస్తవమవడానికి , బందీలుగా వెళ్ళిన ప్రజలు తిరిగి వచ్చి దేవాలయాన్ని కట్టడానికి దాదాపు యాభై సంవత్సరాల పైనే పట్టింది.
మనము జీవిస్తున్న ప్రస్తుత కాలాన్ని జెఫన్యా కాలానికి పోల్చి చూస్తే నాటి పాపాలే నేటి సమాజంలోనూ ఉన్నాయి. అనేక దేవుళ్ళను ఆరాధించడం, దేవుని యెడల నిర్లక్ష్యం, బలాత్కారము మరియు మోసము చేయడం, ధనాశ కలిగి ఉండడం మొదలగు వాటితో ప్రజలు నిమగ్నమైయున్నారు. దేవుని తీర్పు , ఉగ్రత దినాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన లేనివారుగా జీవిస్తున్నారు. చీకటిలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యపు వెలుగును ప్రకటించిన జెఫన్యా వంటి దేవుని సందేశాన్ని నిర్భయంగా ప్రకటించే వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుని ప్రజలు ఆయన నిత్య రాజ్యపు ఆశీర్వాదాలను పొందుకోవాలని కోరుకొంటున్నాడు.
Saturday, 16 November 2024
Tuesday, 5 November 2024
Monday, 14 October 2024
Saturday, 28 September 2024
Saturday, 7 September 2024
Saturday, 24 August 2024
Monday, 12 August 2024
Saturday, 3 August 2024
Saturday, 20 July 2024
Monday, 8 July 2024
Saturday, 22 June 2024
Monday, 10 June 2024
Saturday, 1 June 2024
Monday, 20 May 2024
Sunday, 12 May 2024
అమీ కార్మికేల్ - ఆత్మీయ తల్లి (1861-1951)
బాల్య జీవితము
ఉత్తర ఐర్లాండు దేశమునకు
చెందిన ఒక మధ్య తరగతి కుటుంబము నందు అమీ జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఎంతో దైవ
భయము కలిగిన ప్రెస్బిటేరియన్ (Presbyterians) శాఖకు చెందినవారు. ఆమె తన చిన్నతనము నుండి కూడా దేవుని యెడల
ప్రేమ కలిగినదై తన మూడేండ్ల ప్రాయములో పడకపైననే ఈ విధముగా ప్రార్థించెడిది. 'తండ్రీ దయచేసి వచ్చి నాతో యిక్కడ కూర్చొనుము'. తనకు 16 ఏండ్లు వచ్చునప్పటికీ 'ఆయన హస్తములలోనికి తీసుకొనబడుట' అను అనుభవమును పొందగలిగినది. ఆమె అక్కడనే తన స్థానమును
పదిలము చేసుకొని తన భవిష్యత్ జీవితమునంతటిని క్రమపరచుకొనినది. సాంఘిక సేవ పట్ల
ఉత్తేజితురాలై, అమీ
అనేక కార్యక్రమములను చేపట్టేది. వానిలో మిల్లు కార్మికురాలిగా వుండు బాలికల కొరకు 'వెల్కమ్ హాల్' (Welcome Hall) నిర్మాణము ముఖ్యమైనది. ఇచ్చటనే ఒంటరిగా దేవుని వైపు చూచుట
అను సిద్ధాంతమును ఆమె నేర్చుకొనినది. తనకు కావలసిన ఆర్థిక అవసరతల కొరకు తన
జీవితకాలమంతయూ అమీ దేవుని పైననే ఆధారపడినది.
కార్మికేల్ కుటుంబము
మాన్చెస్టర్ (Manchester) నగరమునకు
వలస పోయినప్పుడు అమీ మురికివాడల పనిలో ఆన్కోట్స్ (Ancoats) కు చెందిన ఫ్రాంక్ క్రాస్ (Frank Crosslay) తో కలిసి పనిచేసింది. 1888లో ఆమె మొదటిసారిగా కేస్విక్ కన్వెన్షన్ (Keswick
Convention) ను దర్శించింది. దాని
సహాయ సంస్థాపకులైన రాబర్ట్ విల్సన్ (Robert Wilson) గారు అప్పటినుండి ఆమె జీవితాంతము వరకూ మంచి మిత్రునిగా వున్నాడు.
కేస్విక్ వారు ఆమెను మిషనెరీగా ఎన్నుకొని చైనాకు గాని, ఆఫ్రికాకు గాని పంపవలెనని తలంచిరి. 'తలుపులను తట్టుట' (Knocking on doors) అను కార్యక్రమములో భాగముగా 1893లో ఆమె జపాన్ దేశమునకు ప్రయాణమయ్యింది. కాని ఒక సంవత్సరము
తరువాత అనారోగ్య కారణముచే ఇంగ్లండునకు తిరిగి వచ్చింది.
భారతదేశమునకు మిషనరీగా
వచ్చుట :
1895లో ఆమె
చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ (Church of England) కు చెందిన జెనానా మిషనరీ సొసైటి (Zenana
Missionary Society) వారిచే దక్షిణ
భారతదేశములోని బెంగుళూరునకు పంపబడింది. ఆమె తిరునల్వెల్లీ జిల్లా (Thirunalvellly
District) నందు తన స్థావరమును
ఏర్పరచుకొని దక్షిణాది చివరి వరకు రెవరెండ్ వాకర్ (Rev. & Mr.
Walker) దంపతులతో కలిసి గ్రామాలలో
సువార్త ప్రకటించే కార్యక్రమములను చేపట్టింది. అమీ త్వరలోనే తన చుట్టూ ఉన్న రక్షణ
పొందిన స్త్రీలతో ఒక గుంపును ఏర్పాటు చేసింది. దానిని ఆమె నక్షత్రముల సముదాయము
లేదా పాలపుంత (Stary Cluster) అని పిలిచెడిది. వారుగ్రామాలకు వెళ్లి అక్కడి గృహాలను దర్శించి, స్త్రీలకు, పిల్లలకు సువార్తను బోధించేవారు. ఒకమారు యిద్దరు గృహముల నుండి తప్పించుకొని
వాకర్ దంపతుల వద్దకు రక్షణ కొరకై వచ్చారు. వారందరిపై దౌర్జన్యము, హింస జరుగునను భయముతో వారు దోనాపూర్ వెళ్లుటకు నిశ్చయించుకున్నారు.
దేవాలయపు బాల బాలికలను సంరక్షించుట
దోనావూర్ నందు 1901లో
మొట్టమొదటిసారిగా అమీ ఒక బాలికను ఆలయము నుండి రక్షించింది. కొందరు క్రైస్తవ
స్త్రీలకు ఆ బాలిక ఒక రాత్రి సమయములో కనబడింది. ప్రీనా (Preena)
అనబడే ఆ బాలిక ఉన్నత కులమునకు చెందినదై ఆ దినమున ఆహారము
తీసుకొనకనే నిద్ర కుపక్రమించింది. వారి ఆహారమును తీసుకొనుట ద్వారా తను కుల
నియమమునకు భంగము వాటిల్లునని భయపడింది. మరుసటి దినమున ఆ బాలికను అమీ వద్దకు
తీసుకొని వచ్చారు. ఆమె ఆ బాలికను తన చేతులలోనికి తీసుకొని ముద్దుపెట్టింది. ఆ
బాలికకు ఆమె స్వంత తల్లి స్ఫురణకు వచ్చింది. స్రీనా అప్పటికే ఒకమారు ఆలయము నుండి
తప్పించుకొని వెళ్ళింది. కాని ఆమె తల్లిదండ్రులు బలవంతముగా తిరిగి ఆలయములోనికి
పంపిరి. ఈ విధమైన తప్పు చేసినందుకు వారు ఆమె రెండు చేతులపై యినుప కడ్డీలతో వాతలు
పెట్టారు. కావున ప్రీనా తాను అమీ వద్దనే వుండుటకు యిష్టపడింది.
'ఆలయపు స్త్రీలు, పిల్లలను పట్టుకెళ్లే మిస్సీ అమ్మాళ్ అని ఆమెను
పిలువసాగిరి. కానీ అమీ వద్దకు వచ్చిన బాలికకు ఆ చెరకంటే యిక్కడ సంతోషముగా
వున్నట్లు తోచినది. కొంతకాలము తరువాత ఆలయపు స్త్రీలు వచ్చి ఆ బాలికను తమతో
పంపివేయుమని చెప్పగా, స్రీనా
తిరిగి అక్కడకు రానని ఖండితముగా చెప్పింది. ఆ దినము నుండి ఆ బాలికకు అమీ తల్లివలె
వ్యవహరించింది. ఆ బాలిక తన జీవితమంతయూ ఆమె వద్దనే గడిపింది. ఆలయములోని జీవితము
గురించి తెలిసికొనిన అమీ ఎంతో దిగ్రమ చెందింది. ఆమె యిటువంటి నిస్సహాయులైనబాలలను
గురించిన వాస్తవాలను వెలికి తీసింది. వారు బలవంతముగా వ్యభిచారము వైపునకు
త్రోయబడుచున్నారని ఆమె గుర్తించింది.
ఆలయమునకు యిచ్చే బాలలు ఎక్కువగా వివాహ జీవితము సరిగా లేని దంపతులకు జన్మించినవారు. వదిలివేయబడిన భార్యలకు జన్మించినవారు. మరికొందరు కొన్ని అనారోగ్యముల నుండి కోలుకొనుటకు తమ కుటుంబము వారిచే దేవునికి బహుమతిగా సమర్పించబడినవారు. ఆలయములో వారికి నృత్యము, సంగీతము మొదలగు వానిలో శిక్షణ నిచ్చేవారు. వారిని దేవుని వూరేగించే సమయములో దీపము మోయుటకు, వింజామరలు విసరుటకు వుపయోగించేవారు. అంతమాత్రమే కాకుండా పురుషులు తమ కోర్కెలు తీర్చుకోవటానికి వారిపై అనేక అత్యాచారాలు చేయడానికి పాల్పడేవారు. యిదంతయూ బహు దుష్టమైన కార్యముగా ప్రకటించుచూ అమీ దీనిని ఖండించెను. ఆమె పరిచర్య గురించి తెలిసినవారు కొంతమంది పసి పిల్లలను ఆలయముల నుండి తప్పించి ఆమె సంరక్షణలోనికి తెచ్చెడివారు. ఆమెతో వున్న స్త్రీల గుంపు ఆమెయొక్క భారమును గమనించి వారునూ పిల్లలను పెంచుటలోను, శిక్షణ నిచ్చుటలోను అమీకి తగు సహాయ సహకారములను అందించిరి.
దోనావూరు సహవాస ప్రారంభము
అమీ దోనావూరునకు వెలుపల
ఒక అనువైన స్థలము కొనుగోలు చేసి ఒక భవనమును నిర్మించెను. ఎక్కువమంది పిల్లలు
వచ్చుట ఆరంభము కాగానే వసతి గృహాల సంఖ్యను కూడా పెంచి జిల్లా అంతటా అనేక క్రొత్త
కేంద్రములను ప్రారంభించిరి. వాటిలో ఒకటి కీలకమైనదిగా గుర్తింపబడి నెయ్యూరు (Neyyoor)
లోని లండన్ మిషనెరీ హాస్పిటల్ సమీపమందు ఏర్పాటు చేయబడెను.
1906వ సంవత్సరానికి వారి గృహాలలో 70 మంది బాలలు వుండిరి. అప్పట్లో ప్రబలిన అతిసార
వ్యాధి మూలమున వారిలో 10 మంది మరణించిరి. 1913 నాటికి వారి సంఖ్య 140కు పెరిగినది.
ఆమెయొక్క ప్రణాళికలలో భాగంగా అడవి యందలి గృహము (Forest House) కూడా చేర్చబడినది. దోనావూర్ నకు ఎగువన పర్వతములపై గల అడవులలో కార్మికులు, వారి పిల్లల కొరకు కార్యక్రమమును ఏర్పాటు చేసినది.
శారీరకముగా, మానసికముగా
వికలాంగులైన బాలల కొరకు ప్రత్యేకమైన గృహములను నిర్మించినది. అవి అందమైన ప్రదేశములో
పర్వతములు మరియు సముద్రము కానవచ్చునట్లుగా నెలకొల్పబడినవి. అన్నిటికంటే బృహత్తరమైన
పథకముగా ఆసుపత్రి భవనములు నిర్మించబడినవి. అవి 'పరలోక స్వస్థత స్థలము' (Place of Heavenly
healing) గా పిలువబడినవి.
ప్రార్థనా జీవితము
ఆమె జీవితమంతయూ ప్రార్థన
అను పాఠశాలలో అభ్యసించుచునే గడిపెను. బెల్ఫాస్ట్ (Belfast) నందు తాను గడిపిన బాల్య జీవితము నుండి కూడా దేవుని
నమ్ముకొనుటలోని రహస్యమును కనుగొనెను. ప్రార్థనలో తప్ప ఎక్కడా ఎటువంటి విన్నపమును
చేయకయే ఆమె తన అవసరతలను అన్నిటిని తీర్చుకొనగలిగెను. ఆమె యొక్క డైరీ అంతయూ తన
ప్రార్థనలకు వచ్చిన జవాబులతో నిండిపోయెడిది. ఆసుపత్రి నిర్మించునపుడు పనివారు
మరియు బాలబాలికలు అందరూ కలిసి పది వేల రూపాయిల కొరకు ప్రార్థించిరి. ఈ విషయమై అమీ
ఒక పుస్తకములో ఈ విధముగా వ్రాసినది. 1 యోహాను 5:14-18 ప్రకారముగా అడిగిన వాటిని పొందగలిగితిమి. పదివేల రూపాయిలు
పరలోక స్వస్థత స్థలము కొరకు అనుగ్రహించబడెను. యిందులో వారందరి సంతకములు కూడా
సేకరించబడినవి.
దోనావూర్లో నిర్మించబడిన
ఆసుపత్రి అక్కడి బాలబాలికలు వైద్య పరిచర్యలో శిక్షణ పొంది, సువార్తికులుగా, ఆత్మల పట్ల ప్రియమైన వారిగా చేయుటలో తోడ్పడెను. మొదటి
దినాలలో దోనావూర్లో జరుగు పరిచర్య పట్ల ఆకర్షితులై ప్రపంచమంతటి నుండి అనేకులు
సహాయకులుగా ఉండుటకు వచ్చిరి. వారిలో కొందరు మధ్యలోనే విడిచిపెట్టిరి. కొంతమంది
ఆత్మీయముగా దిగజారుట వలన మరికొందరు శారీరక శ్రమను తట్టుకొనలేక తిరిగి
వెళ్లిపోయిరి. 1925లో
అమీ CEZMS సంస్థకు రాజీనామా చేసెను. ఆమె ఆ
సంస్థకు చెందినదైనప్పటికీ వ్యక్తిగతముగా తన కార్యక్రమములన్నియు చేసెనని మనము
గ్రహింపగలము. ఆ విధముగానే అమీ దోనావూర్ సహవాసమును కూడా నెలకొల్పినది. నైతిక పతనము
నుండి బాలలను రక్షించి, ఇండియాలో ప్రజలకు దేవుని ప్రేమను
తెలియపర్చుట దాని ముఖ్య ఉద్దేశ్యము. అమీ ఒక కుటుంబ వ్యవస్థను అక్కడ
రూపొందించగలిగెను. ఆమె 'అమ్మ' అని
వారిచే పిలువబడెను. ఆమె పిల్లలకు స్వయముగా స్నానము చేయించి అనారోగ్యముగా
వున్నప్పుడు పరిచర్య చేసెడిది. వారితో కలిసి ఆటలు ఆడుతూ దగ్గరున్న అడవికి
వ్యాహ్యాళికై తీసుకొని వెళ్లెడిది. అక్కడ వారికి జంతువులను ప్రేమించుటను, ప్రకృతి విషయమై దేవుని మహిమపరచుటను వారికి బోధించెడిది.
ముగింపు
1931 అక్టోబరు మాసము 24వ
తారీఖున ఉదయకాల సమయములో అమీ తన కార్యక్రమముల విషయమై దేవుని సన్నిధిలో గడిపింది. 'నీవు కోరిన విధముగా నన్ను చేయనిమ్ము. ఈ నా
ప్రియమైన వారికి సహాయము చేయు విధముగా వుండుటకై వారికి వుపయోగకరముగా నన్ను మలచుము'
అని ఆమె మొఱ్ఱపెట్టింది. మధ్యాహ్నమున ఆమె పడుట వలన కాలు విరిగింది.
మరియు అనేకమైన క్లిష్టమైన అనారోగ్య సమస్యలచే 36 సంవత్సరములు మంచము పైననే వుండవలసి
వచ్చింది.
మిగిలిన 20 సంవత్సరములలో అమీ ఎక్కువగా తన గదిలోనే వుండిపోయింది. అయినప్పటికి తన పడకలోనే ఒక్కోమారు ఆమె అమ్మగా కర్తవ్యములను నిర్వర్తించెడిది. ఉత్తరముల ద్వారా యితరులతో సంబంధము కలిగివుండేది. ఆ విధముగా ఆమె అనేక ఉత్తరములు వ్రాసింది. అప్పటికే అనేక పుస్తకములను రచించిన అమీ ఈ కాలములో మరి 13 రచించింది. తన యితర ప్రచురణలను కూడా సవరించింది. అమీ ప్రారంభించిన కార్యము దేవుని ప్రేమను వెల్లడి చేయుచూ యింకనూ కొనసాగింపబడుచున్నది. ఆమె ఆనాడు పెంచిన పిల్లలందరూ ఇప్పుడు పెద్దవారై ఆమె యొక్క స్వప్నములను సాకారము చేయుచున్నారు. ఇండియాలో ఆమె గడిపిన జీవితమంతటిలోనూ యుద్ధరంగములో పోరాడుచుంటినను దృక్పథమును కలిగి ‘క్రీస్తు నెరుగుట అనగా ఆయన యొక్క పునరుత్థాన శక్తిలో మరియు శ్రమలలో పాలు పొందుటయే' అను సత్యమును అమీ నేర్చుకున్నది.
Quotes from Famous Scientists about God
- Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
- Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
- Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
- Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.