Monday, 15 January 2024
గ్లాడిస్ స్టెయిన్స్(భారత దేశమునకు మిషనరీ) ఒరిస్సా రాష్ట్రంలో సజీవదహనం కాబడిన వైద్య మిషనరీ గ్రాహం స్టెయిన్స్ యొక్క సతీమణి
బాల్యము : గ్లాడిస్ జనవరి 18 ,1951న ఆస్ట్రేలియా లోని kweensland లోగల ఇప్సివిచ్ నందు ఒక పశుపోషకుల (dairy farmers) ఇంటిలో జన్మించింది. చిన్న ప్రాయం నుండే దైవిక విషయాల పట్ల ఎంతో ఆసక్తి కలిగి వుండేది . ఆమె తల్లిదండ్రులు చిన్నతనం నుండి బైబిల్ తోపాటు అనేక మిషనరీ జీవిత గాధలు ఆమెకు బోధించుటచే , ప్రభువు పరిచర్య చేయాలనే దర్శనం బాల్యం నుండే గ్లాడిస్ కలిగి వుండేది. చిన్నప్పటినుండి ఇప్సివిచ్ నందలి బ్రదరన్ సహవాసంలో చురుకుగా పాల్గొనేది. 1964 సంవత్సరంలో ఆమె ఒక ప్రాంతీయ మిషన్ వారి ఆరాధనా కూడికలో పాల్గొంది. అక్కడ ప్రభువు తనతో బలంగా మాట్లాడుచున్నట్లు గ్రహించింది.అప్పుడు ఆమె వయస్సు 13 సంవత్సరములు. ఆమె తాను యేసు ప్రభువు కొరకే జీవించాలని నిర్ణయించుకుంది. అటు తరువాత బాప్తీస్మం తీసుకుని ఆయన యొక్క బలమైన సాక్షిగా జీవించసాగింది. ఆమె నర్సుగా ఆస్ట్రేలియా లోని అనేక ప్రాంతాలలో పనిచేసింది. ఇప్సివిచ్ జనరల్ హాస్పిటల్ లో జనరల్ నర్సింగ్ చదివింది. అటు తరువాత Launceston లోని క్వీన్ విక్టోరియా హాస్పిటల్ లో మిడ్ వైఫెరి(Midwifery) పూర్తిచేసింది. ఆ తరువాత మాటర్నల్ మరియు చైల్డ్ హెల్త్ లో కూడా కోర్సును చేసింది. ఆమె తన వృత్తి పరంగా సండే స్కూల్ ,యవ్వనస్తుల మధ్య పరిచర్య ఇంకా అనేక క్రైస్తవ సహవాసాలలో పరిచర్యలో పాల్గొనేది. తన 18 వ సంవత్సరంలో ఆమె దేవుడు తనను పూర్తి కాల పరిచర్యకు పిలుస్తున్నట్లు గ్రహించింది.
1997 లో స్టెయిన్ దంపతులు ఆస్ట్రేలియాను దర్శించడానికి వెళ్లారు. కాని వారికీ అక్కడ తమ స్వంత గృహము వలె అన్పించలేదు.వారు తమ గృహము ఒరిస్సా ,బారిపద మాత్రమే అని అక్కడి నుండి సంతోషంతో తిరిగివచ్చారు . గ్రాహం తనకు దేవుడు అందమైన భార్య, ప్రేమ కలిగిన ముగ్గురు పిల్లలుమరియుఅనేకులను గౌరవప్రదమైన జీవితంలోకి నడిపించే విధంగా
మిషన్ పరిచర్యను దయ చేసినందుకు ఎంతగానో స్తుతించేవాడు.
స్టెయిన్స్ దంపతులు మిషన్ కాంపౌండ్ లోని ఒక పాత ఇంటిలో ఎంతో సాధారణ జీవితాన్ని జీవించారు. దేవుడు వారికి ముగ్గురు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు.ఎస్తేర్ (నవంబర్ 7 న,1985), ఫిలిప్ (మార్చ్ 31,1988) మరియు తిమోతి హెరాల్డ్ (మే 4,1992) జన్మించారు. వారిలో ఎస్తేర్ , ఫిలిప్ లను విద్య నిమిత్తమై 2,౦౦౦ కి.మీ దూరంలో గల ఉదకమండలం లోని మిషనరీ పాఠశాలలో చేర్పించారు.వారి పిల్లలకు కూడా పరిచర్య పట్ల ఎంతో ఆసక్తి వుండేది. ఫిలిప్ మిషనరీ మనస్సు కలిగి ఉండేవాడు.ప్రతివారిని ఎంతో ప్రేమగా పలకరించేవాడు.ఎస్తేర్ మరియు ఫిలిప్ లు తమ సెలవు దినాలలో తలిదండ్రుల తో కలిసి పనిచేసేవారు. చిన్నవాడైన తిమోతి ప్రతి కూడిక ముందు కుర్చీలు తానే వేసేవాడు. అవి ఖాళీగా వున్న సమయంలో ప్రసంగ వేదిక వద్దకు వెళ్లి ప్రసంగం చేసేవాడు.సొంతగా పాటలు వ్రాసి వాటిని పాడుతూ ఉండేవాడు. అతడు ఎంతో అందంగా చిత్రాలు వేసేవాడు. అతడు చివరగా వేసిన చిత్రపటము ఇప్పటికి వారి పాఠశాలలో భద్రము చేయబడి వున్నది.
స్టెయిన్స్ దంపతులు మిషన్ కాంపౌండ్ లోని ఒక పాత ఇంటిలో ఎంతో సాధారణ జీవితాన్ని జీవించారు. దేవుడు వారికి ముగ్గురు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు.ఎస్తేర్ (నవంబర్ 7 న,1985), ఫిలిప్ (మార్చ్ 31,1988) మరియు తిమోతి హెరాల్డ్ (మే 4,1992) జన్మించారు. వారిలో ఎస్తేర్ , ఫిలిప్ లను విద్య నిమిత్తమై 2,౦౦౦ కి.మీ దూరంలో గల ఉదకమండలం లోని మిషనరీ పాఠశాలలో చేర్పించారు.వారి పిల్లలకు కూడా పరిచర్య పట్ల ఎంతో ఆసక్తి వుండేది. ఫిలిప్ మిషనరీ మనస్సు కలిగి ఉండేవాడు.ప్రతివారిని ఎంతో ప్రేమగా పలకరించేవాడు.ఎస్తేర్ మరియు ఫిలిప్ లు తమ సెలవు దినాలలో తలిదండ్రుల తో కలిసి పనిచేసేవారు. చిన్నవాడైన తిమోతి ప్రతి కూడిక ముందు కుర్చీలు తానే వేసేవాడు. అవి ఖాళీగా వున్న సమయంలో ప్రసంగ వేదిక వద్దకు వెళ్లి ప్రసంగం చేసేవాడు.సొంతగా పాటలు వ్రాసి వాటిని పాడుతూ ఉండేవాడు. అతడు ఎంతో అందంగా చిత్రాలు వేసేవాడు. అతడు చివరగా వేసిన చిత్రపటము ఇప్పటికి వారి పాఠశాలలో భద్రము చేయబడి వున్నది.
సజీవ దహనం: జనవరి 22 ,1999 మనోహర్ పూర్ అనే గ్రామానికి గ్రాహం తన ఇరువురు కుమారులతో కలిసి అక్కడ అడవిలో ప్రతి సంవత్సరం జరిగే కూడిక లో పాల్గొన్నాడు . తమ ప్రియమైన తండ్రితో కలిసి అక్కడికి వెళ్ళుట చిన్నారులకు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది. అక్కడ యవ్వనస్తులైన కొండజాతి వారు గుంపులుగా నృత్యాలు చేయసాగారు. వారు స్టెయిన్స్ బస చేసిన వాహనానికి 100 మీటర్ల దూరంలో వున్నారు.అప్పుడు సమయం అర్థరాత్రి 12.20 గంటలు. అప్పటికే అక్కడకు రామద (Ramada) అనే ప్రాంతము నుండి దారాసింగ్ మరియు అతని బృందం చేరుకున్నారు. దారాసింగ్ క్రైస్తవులను మరియు క్రైస్తవ మిషనరీలను ఎంతో ద్వేషించేవాడు. వారు 12.20 గంటల ప్రాంతంలో అరుస్తూ కర్రలు , ఆయుధాలు పట్టుకొని స్టెయిన్స్ బస చేసిన వాహనాన్ని సమీపించారు. దారాసింగ్ తన వద్ద వున్న గొడ్డలి తో టైర్లను గాలిపోయే విధంగా చేశాడు.మిగతావారు కిటికీల అద్దాలు పగులకొట్టారు.గ్రాహం స్టెయిన్స్ మరియు పిల్లలను కర్రలతో మోదారు. దారాసింగ్ గడ్డిని తెచ్చి వాహనానికి నిప్పు పెట్టాడు.కొన్ని క్షణాల్లో ఆ వాహనం దగ్ధం కాబడింది.గ్రాహం తన ఇద్దరు కుమారులను పొదివి పట్టుకొని ‘క్ర్రీస్తు ప్రభువా’ అని పెదవులతో పలుకుతూ అగ్నికి ఆహుతి అయ్యాడు. వారు పూర్తిగా కాలిపోయే వరకు దారాసింగ్ మరియు అతని మనుష్యులు అక్కడనే వున్నారు. వారు వెళ్ళిన తరువాత అక్కడ వున్న మిగతా మిషన్ టీం వారు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు కాని భయపడి దగ్గరకు వెళ్లలేకపోయారు.
ఎస్తేర్ ఆస్ట్రేలియా లో వైద్య విద్యను పూర్తిచేసి , వివాహం చేసుకొని వైద్యురాలిగా అక్కడనే స్థిరపడినప్పటికి తరచూ భర్త తో కలిసి ఒరిస్సాకు వస్తూ తన తల్లి చేస్తున్న పరిచర్యలోను సహాయసహకారాలు అందిస్తున్నది. వారు నూతనంగా గ్రాహం స్టెయిన్స్ మెమోరియల్ హాస్పిటల్ ను బారిపద లో నిర్మించారు. గ్లాడిస్ ఇప్పటికి లెప్రసీహోం లోని వ్యాధిగ్రస్తుల గాయాలు కడుతూ, అనేకులకు సువార్తను ప్రకటిస్తూ తన పరిచర్యను కొనసాగిస్తున్నది. గ్లాడిస్ ఇలా అంటారు “ నా భర్త ఐదుగురు మనుష్యలు చేసే పనిని ఒక్కడే చేసేవాడు.... కాని నేను ఒక సాధారణ గృహిణిని....నాకు శారీరకంగా ఎన్నో హద్దులు వున్నాయి.....నా ప్రార్ధన ఇది, ప్రభువా నేనుఒక్కదాన్నే ఈ పరిచర్య అంతా చేయలేను......సవాళ్లతో కూడిన ఈ పరిచర్యలో పాలుపొందడానికి నీవు ఏర్పరుచుకొనిన వారిని పంపుము. భారత దేశములోని క్రైస్తవులు లెప్రసీహోం పనికి కొంత సహాయపడటానికి సిద్ధపడివస్తే అది ఎంతో అద్భుతం. దేవుడు నిజంగా పనిచేస్తున్నాడు....మరియు సాతాను ఆ విషయమై ఎన్నడూ సంతోషించడు......మనము ఇంకా ఎక్కువ శ్రమలను మాత్రమే ఊహించవచ్చు.”
ఈ శక్తివంతమైన జీవితగాథ శ్రమలలోగుండా వెళ్ళే క్రైస్తవుల జీవితం ఎలా వుంటుందో మనకు తెలియజేస్తుంది. గ్లాడిస్ వలె ప్రభువు పరిచర్యలో ధైర్యంగా ముందుకు సాగుటకు ప్రతి ఒక్కరు పురికొల్పబడాలని ఆశిస్తున్నాను.
Monday, 8 January 2024
Monday, 1 January 2024
Subscribe to:
Posts (Atom)
Quotes from Famous Scientists about God
- Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
- Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
- Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
- Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.
Today's Verse
Kreestu Yokka Siluva
Visit Elselah Book House
Total Pageviews
25,138