Thursday 21 March 2024

Genesis Chapter 17 Quiz

1. In Genesis 17, what name did God change Abram's to?

a) Israel

b) Isaac

c) Abraham

2. What was the sign of the covenant that God made with Abraham in Genesis 17?

a) A rainbow

b) Circumcision

c) Sacrifice of animals

3. What did God promise to do for Abraham in Genesis 17?

a) Make him wealthy

b) Give him a son through Sarai

c) Make him a father of many nations

4. What was the age of Abraham when God made the covenant of circumcision in Genesis 17?

a) 75 years

b) 86 years

c) 99 years

5. What name did God change Sarai's to in Genesis 17?

a) Hagar

b) Rachel

c) Sarah

6. Who did God promise to establish His covenant with through Sarah's son in Genesis 17?

a) Ishmael

b) Isaac

c) Lot

7. What did Abraham do immediately after God spoke to him in Genesis 17?

a) Built an altar

b) Circumcised himself

c) Laughed

8. How old was Ishmael when he was circumcised in Genesis 17?

a) 8 years

b) 13 years

c) 16 years

9. What did Abraham ask God concerning Ishmael in Genesis 17?

a) That Ishmael would be the heir

b) That Ishmael would be blessed

c) That Ishmael would live long

10. What did God say Sarah would bear in Genesis 17?

a) A son named Jacob

b) A son named Isaac

c) Twin sons

Saturday 16 March 2024

Bible Women -Quiz 2

 

 1.How many daughters does the evangelist Philip have?
    1
    2
    4
 2.Who was the first person to proclaim Jesus as the Christ?
    Mary
    Ann
    Martha
 3.What sin did Solomon's wives influence him to commit?
    Stealing
    Lieing
    Worship of Idols
 4. Which Prophet advised Jezzebel to cease her worship of Idols
    Jonah
    Isaiah
    Elijah
 5. What was Naomi's relationship with Ruth?
    Mother-in-law
    daughter
    Mother
 6. What did Jesus tell the Samaritan women that God would give to her?
    Riches
    Living Water
    Health
 7. What was tha name of the Salomee's Husband?
    Zebedee
    Micah
    Paul
 8. What god did Jezzebel worship and bring with her into Israel when she married king Ahab?
    Baal
    Odin
    Zeus
 9. Who was the Israeli warrior did Deborah accompany into battle at Kedesh?
    Barak
    Saul
    Solomon
 10. What was the name of Deborah's Husband
    Lappidoth
    Dan
    Gideon

Tuesday 5 March 2024

Bible WOMEN - Quiz1


Quiz-1

El-SelahBook House invites you to this online Bible Quiz.This Quiz helps you to grow spiritually in the word of God
  • 1. This woman hung a red rope from her window...

  • Eve
    Rahab
    Tamar
    Ruth

  • 2.This woman conspired with her husband to lie to the Holy Spirit...

  • Rahab
    Mary
    Jezebel
    Sipphera

  • 3.This woman laughed at God's promise concerning her child...

  • Sarah
    Hagar
    Mary
    Elizebeth

  • 4.This woman had bad eyesight...

  • Leah
    Sarah
    Rachel
    Hagar

  • 5.This woman kept watch over her baby brother as he was rocked by the Nile...

  • Eve
    Melissa
    Miriam
    Dinah

  • 6.This woman was visited by a desperate and disguised king of Israel...

  • Michal
    Abigail
    Bathsheba
    Delilah

  • 7.This woman was the mother of Benjamin...

  • Rachel
    Leah
    Sarah
    Rebekah

  • 8.This woman married a carpenter...

  • Rachel
    Elizabeth
    Mary
    Martha

  • 9.This woman was David's great-grandmother...

  • Michal
    Abigail
    Ruth
    Rachel

  • 10.This woman and her husband were tent makers...

  • Martha
    Mary Magdalene
    Lydia
    Priscilla

    మదర్ థెరీసా (1910-1997)

     


    “ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వగలిగితే, అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి “

    మదర్ థెరీసా చిన్న వయస్సులోనే , భారతదేశంలో నన్ గా సేవలందించుటకు తాను పిలువబడ్డానని గ్రహించారు. 1946 వ సంవత్సరములో కలకత్తాలో నివసిస్తూ బోధన వృత్తిని కొనసాగిస్తున్న ఆమె కలకత్తాలోని అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బీదవారి మధ్య నివసించి వారికి ఉచిత సేవలను అందించాలని “తన పిలుపులోనే మరొకపిలుపు” ను ఆమె పొందుకున్నారు. ఆమె భారత దేశానికి వచ్చి తన జీవితాంతం వరకు అట్టడుగు స్థితిలో ఉన్న బీద ప్రజలకు, అనాధలకు, అనారోగ్యంతో ఉన్నవారికి  చేసిన సేవ మరుపురానిది.

    స్కోపే నగరంలో బాల్య జీవితం :

    అది సెర్బియా లోని స్కోపే నగరం. అక్కడ ఆల్బేనియాకు చెందిన కుటుంబాలు అనేకం నివసించేవి. బోయాజీన్ కుటుంబం కుడా అందులో ఒకటి. అక్కడి ప్రజలు టర్కిష్ మరియు సెర్బోక్రొయేషియన్ భాషలు మాట్లాడేవారు. ఆల్బేనియన్లు మాత్రం ఇంట్లో ఆల్బేనియన్ భాషనే మాట్లాడేవారు. బోయాజీన్లు  ఈస్టర్న్ అర్థడాక్స్ క్రిస్టియన్లుగా  పిలువబడే కేథలిక్ లు. స్కోపే లో అనేకులు ముస్లింలు కూడా ఉండేవారు. ఆ నగరంలో మసీదులు, ఎత్తయిన మినారేట్లు ఎక్కువగా ఉండేవి.

    నికోలాయ్ బోయాజీన్ మరియు డ్రేనాఫిల్ దంపతులు స్కోపేలో స్థిరపడ్డారు. నికోలాయ్ , మోర్టేన్ అనే ఒక ఇటాలియన్ వ్యక్తితో కలిసి వ్యాపారం చేసేవాడు. తినుబండారాలు, వస్తువులు, లెదర్ సామానులు మొదలగు వాటిని కొనుగోలు చేసి అమ్మేవారు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె అగాథా, కుమారుడు లాజర్ మరియు చిన్న కుమార్తె గోన్జా. వారు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుండేవాళ్ళు. అతిథులను రంజింపజేయడానికి పాటలు పాడేవాళ్ళు. వాయిద్యాలను వాయించేవాళ్ళు. వారి ఇంటికి వచ్చే అతిథులు కొందరు మురికిగా ఉండేవారు. వారి నుండి దుర్వాసన వచ్చేది. కొందరికి ఆహారాన్ని , వస్త్రాలను తరచుగా ఇచ్చేవారు. తన చిన్న కుమార్తె గోన్జాతో తల్లి ఈ విధంగా చెప్పేది. “యేసు ఈ విధంగానే గాయాలతో బాధపడ్డాడు గోన్జా, ఇటువంటి ప్రజలకు నీవు సహాయం చేస్తే యేసయ్యకు సహాయం చేసినట్టే “

    గోన్జా అనగా ఆల్బేనియన్ భాషలో “పూ మొగ్గ “ అని అర్థం. ఆమె తల్లి తన చిన్న కూతురుని ఎంతో ముద్దుగా గోన్జా అని పిలుచుకునేది. గోన్జా యేసు ఈలోకానికి పసిబిడ్డగా అవతరించిన కారణంగా వచ్చిన ఆనందాన్ని గూర్చి ఆలోచించేది. ఆయన సిలువ వేయబడిన విషయం గూర్చి చింతించేది. ఆరేళ్ళ వయస్సులో అక్కడి చర్చ్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ కు చెందిన బడికి వెళ్ళేది. చిన్నప్పటి నుండే ఆల్బేనియన్, సెర్బో క్రొయేషియన్, టర్కిష్ , ఫ్రెంచ్ మరియు ఇటాలియన్ భాషలు మాట్లాడేది. గోన్జా కవితాత్మకముగా ఉండేది. కథలు రాసేది. అగాథా ఎక్కువ తెలివి గలది. లాజర్ తన తండ్రి వలె ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు.

    వారు నివసించే ప్రాంతంలో యుద్ధాలు సర్వసాధారణంగా జరుగుతుండేవి. తమ పాత శత్రువైన టర్కీకి వ్యతిరేకంగా సెర్బ్ లు, అల్బేనియన్లు పోరాడేవారు. గోన్జా తండ్రి యుద్ధసమయంలో మరణించాడు. రాజకీయంగా అతనికి విషం ఇచ్చి చంపారని గోన్జా విన్నది. రాజకీయాలు ఎంత ప్రమాదకరమైనవో గోన్జాకు అర్థం అయ్యింది. తన తండ్రి యొక్క వ్యాపారాన్ని ఆర్ధిక అవసరాల నిమిత్తం  తల్లి కొనసాగించింది. స్వయంకృషి తో వ్యాపారాన్ని ఆమె త్వరగానే అభివృద్ధి చేసింది. ప్రతి వ్యక్తీ కూడా సాధారణంగా ఇతరులు ఊహించే దానికన్నా ఎంతో తెలివైనవారు మరియు విలువైనవారు అనే సత్యాన్ని ఆమె తల్లిని చూసి తెలుసుకున్నది.  “పేదవాళ్ళు కూడా విలువైన వారే, దేవుని దృష్టిలో వస్తు సంపదకు అసలు విలువ లేదు” అని నమ్మింది గోన్జా. తాను పెద్దయిన తరువాత ఒక ఉపాధ్యాయురాలిగా కావాలని తలంచేది.

    గోన్జా చదువులో , చర్చి కార్య కలాపాల్లో ముందుండేది. స్కూల్ లో తానే టాప్ స్టూడెంట్. ఆమె ముఖం ఎత్తయిన నుదురు, మెరుస్తున్న కళ్ళతో ఎంతో తేజస్సుతో ఉండేది. ఆమె ఇంటి పని చేసేది. ఖాళీ సమయాలలో అమ్మతో కలిసి పేదలను దర్శించేది. చర్చి ఫంక్షన్లలో అక్కతో కలిసి పాటలు పాడేది. స్నేహితులతో ఆటలాడేది. పుస్తకాలు మరియు పద్యాలు వ్రాసేది.

    ఒకనాడు వారి చర్చి ఫాదర్ ఇగ్నేషియస్ లయోలా మాటలను గోన్జాకు గుర్తు చేశారు . “నేను క్రీస్తు నిమిత్తం ఏమి చేసాను? క్రీస్తు కొరకు నేను ఏమి చేస్తున్నాను? క్రీస్తు కొరకై నేను ఏమి చేయబోవుచున్నాను? “. గోన్జాను అవి ఎంతో ఉత్తేజపరిచాయి. చర్చికి సంబంధించిన బృందంతో కలిసి నూతన కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనసాగింది.

    “సహాయం చెయ్యడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనస్సు”

    భారతదేశానికి మిషనరీగా ప్రయాణం :

    భారతదేశం గురించి కథలు కథలుగా విన్నా గోన్జాకు ఆ దేశమంటే ఎంతో యిష్టం కలిగింది. అనేక భాషలు, అనేక మతాలు, భారీ సంఖ్యలో ప్రజలు అంతేకాకుండా వారు పడుతున్న వేదన. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలో భారతదేశం ఉండేది. 1600 సంవత్సరం నుండి బ్రిటిష్ ఆధిపత్యం అధికమయ్యింది. 1800 సంవత్సరం చివరకు అనేకమంది విద్యావంతులైన భారతీయులు కలిసి ఒక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. గోన్జాకు బెంగాల్ ప్రాంతం ఎంతో ఇష్టమైనది. భారతదేశాన్ని గూర్చి తనకు దొరికిన సమాచారాన్ని అంటా చదివింది. ఆమెకు దేవుడు భారతదేశానికి రమ్మంటున్నాడని అర్థమయ్యింది. కాని ఇంట్లో అమ్మ మరియు అక్క, సోదరుడు దీనిని సమర్థించలేదు. ఆమె యవ్వనస్తురాలైనప్పటికీ  అయిదు అడుగుల ఎత్తు తో చూడటానికి  చిన్న పిల్లలా ఉండేది. నలభై కేజీల బరువు కూడా ఉండేది కాదు. భారతదేశానికి మిషనరీగా వెళ్ళడం అంటే తన కుటుంబంతో పూర్తిగా వేరుపడటమే. కాని ఆమె తల్లి చివరకు విచారంగా “గోన్జా, నీవు వెళ్ళవచ్చు , నా దీవెనలు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి. కాని దేవుని కొరకు, క్రీస్తు కొరకు మాత్రమే జీవించుటకు ప్రయాసపడు” అని ఆమెను దీవించింది.

    1928 వ సంవత్సరం సెప్టెంబర్ 26 న గోన్జా భారతదేశానికి బయలుదేరింది. ఆమె ఎక్కిన రైలు యుగోస్లోవియా మీదుగా పారిస్ కు చేరింది. ఈ మధ్యలో మరో సిస్టర్ బెటికే తోడయ్యింది. పారిస్ నుండి వారు  ఐర్లాండ్ వెళ్ళే ఓడలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో వారికి కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు ఇవ్వబడ్డాయి. గోన్జా ఇంగ్లీషు భాషలో ప్రార్ధించడం కూడా నేర్చుకుంది. 1929 వ సంవత్సరం క్రిస్మస్ సమయంలో వారు సిలోన్ కు చేరారు. ఆ తరువాత కొన్ని దినాలకు మద్రాసు చేరారు. అక్కడ ఆమె చూసిన దారిద్ర్యం ఎన్నడూ ఊహించనిది. తాటాకులతో అల్లబడిన చాపలపై కుటుంబాలు వీధులలోనే నివసిస్తున్నారు. బురదనేల  మీద నివాసముంటున్నారు. వారికి ఒంటి మీద గుడ్డలు కూడా సరిగా లేవు. ముక్కులకు, చెవులకు ఆభరణాలు ధరించారు. భారతదేశం అంటే ఇదన్నమాట అని తన తోటి సిస్టర్ బెటికే తో అన్నది గోన్జా. జనవరి 6న వారు హుగ్లీ నది ఒడ్డునకు చేరారు. తనకిష్టమైన బెంగాల్ నెల పై అడుగుపెట్టినందుకు గోన్జా ఎంతో సంతోషించింది. 1929 వ సంవత్సరం మే 24 న గోన్జా మరియు బెటికే లను నన్స్ గా అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం డార్జిలింగ్ లో జరిగింది. గోన్జా ను సిస్టర్ మేరి థెరీసా గా బెటికే ను సిస్టర్ మేరీ మగ్ధలేనే అని నామకరణం చేశారు. వారిరువురు హ్యాబిట్ అనబడే వాదులు వస్త్రాన్ని ధరించి భుజాల క్రింద వరకు తెల్లటి కాలర్ ధరించాలి. తల పై తెల్లని ముసుగు ధరించి దేవదూతల వలె కనిపించసాగారు. వారికి రెండు సంవత్సరాల పాటు శిక్షణ నిచ్చారు. దైవిక సారాంశాలను జ్ఞాపకముంచుకొని బయటకు వల్లేవేయుటను అలవాటు చేసుకున్నారు. బైబిల్ లోని చిన్న వచనములు, కీర్తనలు, పాఠాలు, త్యాగధనుల జీవిత గాథలు వంటి కథనాల కూడికే ఈ దైవిక సారాంశాలు. 1932 వ సంవత్సరంలో తన కుటుంబం నుండి ఒక లేఖను అందుకున్నది సిస్టర్ థెరీసా. తన తల్లి స్కోపే నగరంలోనే ఒంటరిగా నివసిస్తున్నదని మరియు తన అక్క అగాథా సహోదరుడు లాజర్ తిరానా లో నివసిస్తున్నారని , తన తల్లి తానూ చేస్తున్న పని పట్ల ఎంతో సంతోషిస్తున్నట్లుగా తెలుసుకున్నది.

    ఆ దినాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయుల పోరాటం ఎంతో ఉధృతంగా జరుగుతూ ఉండేది. నాయకుడైన గాంధీని, ఇతర జాతీయ కాంగ్రెస్ నాయకులను చెరసాలలో పెట్టారు. గాంధీ యొక్క వ్యక్తిత్వం థెరీసాను ఆకట్టుకునేది. ఆయనకు కొండ మీడి ప్రసంగం అంతా కంఠతా వచ్చు. “లీడ్ కైండ్లీ లైట్ “అంటూ తానూ ఇష్టపడే క్రైస్తవ గీతాన్ని ఆయన తరచూ పాడుతూ వుంటారు. ఆయన ఒక బలమైన నైతిక శక్తి. ఆ దినాలలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే కోట్లాది భారతీయులు ఆయనకు మద్దతుగా బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. ప్రపంచంలో కూడా సరియైన పరిస్థితులు లేవు. జర్మనీలో నాజీ పార్టీ నాయకుడు హిట్లర్ దుష్ట కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. పోప్ ఉండే ఇటలీ దేశంలో కూడా పరిస్థితులు సమాధానంగా లేవు. ఇటువంటి  పరిస్థితులలో థెరీసా తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే తానొక సామాన్య క్రీస్తు సేవకురాలిగా మిగిలిపోతానని అర్థం చేసుకుంది. బెంగాలీ భాషను కష్టపడి నేర్చుకుంది. ఒక బెంగాలీ స్కూల్ లో చరిత్ర, , భూగోళ శాస్త్రాలను బోధించడం ప్రారంభించారు. 1935 వ సంవత్సరంలో 20 సంవత్సరాల వయస్సు వున్న సిస్టర్ థెరీసా తన బోధనలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ అనేకమంది ఇతర నన్ లకు తమ పరీక్షలలో సహాయం చేసింది. వీటితో పాటు రోగులకు కూడా సేవలందించింది. థెరీసా తన చుట్టూ దారిద్ర్యంలో ఉన్న పేదప్రజలు ఏవిధంగా సహాయపడాలి అని ఎల్లప్పుడూ వారి విషయమై మథనపడేది.

    1939 నుండి 1944 వరకు అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 1945 లో ఊహించని పరిణామాలు జరిగాయి అప్పుడు జరిగిన హిందూ ముస్లిం ఘర్షణలలో ఒక్క కలకత్తా నగరంలోనే వేలాదిమంది మరణించారు. ఆ సమయంలో డార్జిలింగ్ కు సదస్సు నిమిత్తం పయనమయిన థెరీసా కు ఒక స్వరం వినిపించింది. “బీదల యొద్దకు వెళ్ళు, కాన్వెంట్ ను విడచి పెట్టు”. కాన్వెంట్ నుండి బయటకు వచ్చి అట్టడుగు వర్గాల ప్రజలతో కలసి జీవిస్తూ తన సేవలను కొనసాగించుటకు థెరీసా పై అధికారులకు వినతి పత్రాన్ని పంపింది.

    “నువ్వు ఇతరుల లోపాలను వెతకడం ప్రారంభిస్తే ...ఎవరినీ ప్రేమించలేవు”

    మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్థాపన :

    థెరిసా పాట్నా లోని మెడికల్ మిషన్ సిస్టర్స్ వద్ద శిక్షణ తీసుకుంది. క్షయ వ్యాధి మరియు కుష్ఠు వ్యాధిగ్రస్తులను దగ్గరనుండి చూశారు. అలా పరిశీలించడమే కాకుండా ఆ వ్యాధిగ్రస్తులకు సేవచేయడం ప్రారంభించారు. మరణించే స్థితిలో ఉండే అనేకులను చేతులు పట్టుకొని వారిని ఓదార్చేది. రోగి దగ్గర లేనప్పుడు వారి పరుపులు మార్చడం , రోగులకు స్నానం చేయించడం, ఇంజెక్షన్లు చేయడం ఆమె నేర్చుకున్నారు. స్త్రీలకు ప్రసవ సమయంలో కూడా  ఆమె సహాయం చేసేవారు.

    1948 వ సంవత్సరం డిసెంబర్ 8 వ తారీఖున తిరిగి కలకత్తా చేరుకున్నారు. తన చుట్టూ ప్రక్కన గల మురికి గుదీసెలలొ నుండి 5 గురు పిల్లలను తీసికొని వారికి పెరెల్ లేక ప్రక్కన గల ఖాళీ స్థలంలో చదువు నేర్పడం ప్రారంభించారు. కొద్ది రోజులలోనే ఆ బిడ్డలు ఆమె కొరకు ప్రతిరోజూ ఎదురు చూడటం ఆరంభించారు. తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడం వారికి నేర్పారు. పరిశుభ్రత, అక్షరాభ్యాసత తో పాటు మంచి అలవాట్లు, మాట విషయాలను కూడా వారికి బోధించారు. ఊహించని రీతిలో కొందరు ఆమెకు సహాయం చేయడం ప్రారంభించారు, కొందరు ఆహారం, సబ్బులు, పాలు మొదలైనవి  తెచ్చి ఇవ్వసాగారు. త్వరలోనే 35 మంది పిల్లలు చేరారు. కొన్ని దినాల తరువాత కలకత్తా కార్పోరేషన్ నుండి నిధుల కొరకు దరఖాస్తు చేసుకోమని కొందరు సలహా ఇచ్చారు. కాని ప్రభుత్వ సహాయంతో కాకుండా స్వచ్చందంగానే సేవ చేయాలని విశ్వాసంతో అడుగు ముందుకేశారు. ఆ తరువాత ఒక ఉచిత క్లినిక్ ను కూడా ఆమె ప్రారంభించారు. తరువాతి దినాలలో కలకత్తా లోని ఇరుకైన ప్రాంతంలో గోమ్స్ అనే భారత సంతతి వారికి చెందిన వారు తమ గృహాన్ని థెరీసా సేవల నిమిత్తమై ఉచితంగా ఇచ్చారు. ఆమెతో పాటు సహకరించడానికి మరో ఇద్దరు సిస్టర్లు ముందుకు వచ్చారు. “సంతోషంతో మీ సేవలను అందివ్వండి” అని థెరీసా పదే పదే వేడుకునేవారు. మనుష్యులకు సహాయం చేస్తే యేసుకు సహాయం చేసినట్లే అని ఆమె ఎల్లపుడూ జ్ఞాపకం చేసుకుంటారు.

    థెరీసా ఒక చక్కని క్రమశిక్షణ గల ప్రణాళికను తన వసతి గృహంలో అనుసరించేవారు. ఎప్పుడు ప్రార్ధించాలి? తినాలి? ఇంటి నుండి బయటకు వెళ్ళాలి? మొదలగు పనివేళ కొరకు గంటను మ్రోగించేవారు. 1950 సంవత్సరాని కల్లా మిషనరీస్ ఆఫ్ చారిటీస్, కలకత్తా దయాసిస్ నందు ఒక చాపెల్ ప్రారంభమయ్యింది. 1952 లో “నిర్మల్ హృదయ్” ను ప్రారంభించారు. ఆ వసతి గృహంలో అందరూ ఆమెను ‘మదర్’ గా సంబోదించేవారు. మరణావస్థ లో ఉన్న పేదలను సిస్టర్లు మాత్రమే కాకుండా ఆరోగ్య విభాగం వారు కూడా నిర్మల్ హృదయ్ కు తీసుకొని రాసాగారు. అనేకులు దానిని ‘ చనిపోవుచున్న వారికి ఆశ్రయ గృహము’ అని పిలువసాగారు. చనిపోతున్న వారిని ఆఖరు క్షణాలలో క్రైస్తవులుగా మారుస్తున్నారని పుకార్లు వచ్చాయి. కాని థెరీసా ఏ ఒక్కరికీ జవాబు నిచ్చేవారు కాదు. చిరునవ్వుతో “ దేవుడు మిమ్మును కాపాడతాడు, ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు “ అని మాత్రమే పలికేవారు.

    1961 వ సంవత్సరానికంతా 130 మంది సిస్టర్లు సేవలో ఉన్నారు. బెంగాల్ లోని అసాన్సోల్ నందు కుష్ట సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.1962 వ సంవత్సరం లో  మహారాష్ట్ర  ప్రాంతంలో మరొక సేవా సదనాన్ని ప్రారంభించారు. ఆ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ థెరీసా ను రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించారు. 1984 సంవత్సరానికంతా 270 హౌస్ లలో 2,400 మంది సిస్టర్లు 70 హౌస్ లలో 500 మంది బ్రదర్లు పరిచర్యలో ఉన్నారు. వారితో పనిచేసే కొ- వర్కర్ల సంఖ్య లక్షకు మించే ఉంటుంది. పీడిత ప్రజలు, వ్యభిచారులు, ఎయిడ్స్ బాధితులు వంటి వారికి నూతన సేవలు ఆరంభించారు. 1996 లో థెరీసా తన  వ ఏట  గుండెపోటు బారిన పడ్డారు. కాని ఆమె అనారోగ్యము నుండి కోలుకొని తిరిగి తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు. 1997 వ సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉదయకాలపు ఆరాధనకు హాజరయిన థెరీసా తీవ్ర గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

    ప్రతివాళ్ళు గొప్ప సేవలు చెయ్యలేకపోవచ్చు

    కాని చేసిన చిన్న సేవ గొప్పగా ఉండాలి

    మనిషిని పట్టి పీడించే పెద్ద వ్యాధి కుష్ఠు రోగమో, క్షయనో కాదు

    తాను ఎవ్వరికీ అక్కర్లేదనే భావనే !

    ముగింపు :

    మదర్ థెరీసా  1979 వ సంవత్సరం లో నోబుల్ బహుమతి తో సహా అనేక అంతర్జాతీయ , జాతీయ అవార్డులను తన సేవలకుగాను అందుకున్నారు. ఒక ఆశ్రయ గృహము, ఒక అనాథ ఆశ్రయము, ఒక కుష్ఠు రోగుల కాలనీ, వివిధ వైద్య కేంద్రాలు, లెక్కించలేని సంఖ్యలో నిరాశ్రయులకు ఆశ్రయాలు భారత దేశం అంతటా మరియు అంతర్జాతీయంగా స్థాపించబడ్డాయి. ఆమె చిన్న రూపం ప్రపంచవ్యాప్తంగా కనికరానికి మారుపేరుగా నిలిచిపోయింది. అభాగ్యులు అన్నివిధాలా బలపరచబడి గుర్తింపు పొందాలని ప్రత్యేకించి యేసు ప్రేమతో నింపబడి శక్తి పొందాలని మదర్ థెరీసా వారిని వెదుకుతూ వెళ్లి తన సేవలను అందించారు. ఆల్బేనియాకు చెందిన ఈ చిన్న పుష్పం భారతదేశం అంతటా తన సేవా పరిమళాలను వెదజల్లింది. క్రీస్తు ప్రేమకు చిహ్నంగా ప్రజల హృదయాలలో నిలిచిపోయింది.



    Visit https://missionariesofcharity.org/










    Sunday 3 March 2024

    పండిత రామాబాయి - వెలివేయబడినవారికి తల్లి (1858-1922)

     


    కలతలు లేని బాల్యం :

    పండిత రామాబాయిగా పేరుగాంచిన రామాబాయి దక్షిణ భారతదేశములోని మంగళూరు జిల్లాలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబము నందు జన్మించింది. ఆమెకు ఆరు సంవత్సరముల ప్రాయములోనే ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డలందరితో కలిసి తీర్థయాత్రలు చేయుటకై తమ గృహమును విడిచిపెట్టారు. చిన్నదైన రామాబాయిని ఒక గంపలో కూర్చుండబెట్టుకొని అన్ని స్థలములకు మోసుకొని వెళ్ళేవారు. వారు ఒక పుణ్య స్థలము నుండి మరియొక చోటికి వెళ్లుచూ ప్రతి స్థలములో కొన్ని నెలలు గడిపేవారు. ఆ సమయములో వారు అక్కడ గల పవిత్ర నదులలో స్నానము చేయుచూ సమీపాన గల ఆలయాలనన్నిటిని దర్శించేవారు. వారి తండ్రి సంస్కృత భాషలో మిక్కిలి పాండిత్యము గలవాడు. భక్తి శ్రద్ధలు గల హిందువులకు అతడు పురాణములను చదివి వినిపించేవాడు. వారు సమర్పించే కానుకలతోనే వారి కుటుంబ పోషణ జరిగెడిది. రామాబాయి యొక్క తల్లి కూడా పురాణములను, సంస్కృత భాషలో చదువుట తన భర్త వద్ద నేర్చుకొన్నది. చిన్నదైన రామాబాయి కూడా తన తల్లివద్ద చదువుట నేర్చుకుంది. వారి తండ్రికి ఆ పని చేయుట కష్టమయ్యే వరకూ  వారు ఆ విధముగానే జీవించారు.


     కష్టాలలో కుటుంబం :

    వారికి వచ్చే సంపాదన అంతా ఖర్చు అయ్యేది. వారికి గల మత సంబంధమైన నిబంధనల కారణముగా వారు మరియే యితర పనిని చేయలేకపోయేవారు. దక్షిణ భారతదేశములోని వారు నివసించే ప్రాంతములో గొప్ప కరువు సంభవించింది. ఎక్కడ చూచినా ప్రజలు ఆకలి బాధతో అలమటించుచూ ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు తరలిపోసాగారు. రామాబాయి వారి కుటుంబస్థులు బిచ్చమెత్తలేక, మరియే యితర పనిని చేయలేకపోవుటచే వారు తినుటకు తిండి గింజలు లేని పరిస్థితి వారికి ఒక దినమున ఎదురయ్యెను. వారు అందరూ సామూహికముగా ఆత్మహత్య చేసుకొనవలెనని తలంచిరి. కాని దేవుడు ఆ విధముగా వారు చేయకుండ తన కృపను వారిపై చూపెను. వారు ఒక గ్రామములోని ఆలయములో తలదాచుకొనిరి గాని బ్రాహ్మణ పూజారులు వారిని వెళ్లగొట్టారు. వారు గ్రామము వెలుపల గల ఒక పురాతన, శిథిలమైన ఆలయములోనికి తమ మకాము మార్చిరి. అచ్చటనే వారి తండ్రి మరణించాడు. పిమ్మట కొద్ది కాలమునకే వారి తల్లి మరియు సహోదరులు కరువు బాధకు తట్టుకొనలేక మరణించారు. ఈ విధమైన శ్రమలు ఆమెకు చిన్న ప్రాయములోనే సంభవించుట వలన తరువాతి కాలములో అటువంటి శ్రమలలో నున్నవారిని విడిపించుటకు, వారికి సహాయము చేయుటకు గల అనుభవమును పొందగలిగింది.


    కలకత్తా నగరములో రామాబాయి:

    రామాబాయి మరియు ఆమె సహోదరుడు మాత్రమే వారి కుటుంబములో మిగిలారు. ఒక రాత్రి వారు చలిలో తమను తాము గొంతువరకు యిసుకలో పూడ్చుకొనుటకు నదీ తీరమునకు వెళ్లారు. తరచుగా వారు పస్తులుండేవారు. వారు ఆ విధముగానే ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు వెళ్లుచూ ఆలయములను దర్శించుచూ దేవుళ్లను మ్రొక్కుచూ  దాదాపు భారతదేశమంతయూ తిరిగారు. వారు దాదాపు 4 వేల మైళ్ల దూరమును కాలి నడకనే నడచి చివరకు కలకత్తా నగరమును చేరారు. అక్కడ వారికి పండితులైన బ్రాహ్మణులతో పరిచయము కలిగింది. పురాణములను చదివి వినిపించుట ద్వారా వారు తమకు కొంత ధనమును, ఆహారమును సంపాదించుకొనగలిగారు. రామాబాయి యుక్త ప్రాయమునకు వచ్చి ఒక మేథావంతురాలైన స్త్రీ అయ్యింది. అక్కడి పండితులు ఆమె పాండిత్యమునకు అచ్చెరువొందెడివారు. ఆమె భారత స్త్రీలకు విద్య అభ్యసించవలసిన ప్రాముఖ్యత ఎంతో కలదని నొక్కి చెప్పెడిది. ఆమెకు గల పట్టుదలకు, ధైర్యమునకు వారు ప్రశంసించెడివారు. వారు ఆమెను పండిత రామాబాయిగా పిలువసాగారు.

    కలకత్తాలోనే ఆమెకు మొదటిగా క్రైస్తవులతో పరిచయము కలిగింది. ఆమె క్రైస్తవుల కూడికకు ఆహ్వానింపబడింది. వారి ఆచార వ్యవహారములు, పద్ధతులు ఆమెలో ఉత్సుకతను కలిగించింది. వారు ఆమెకు సంస్కృత భాషలోని బైబిల్ను చదువుటకై ఇచ్చారు. ఆమె దానిని చదువలేకపోయెను. ఎందుకనగా ఆ విషయములు ఆమెకు బోధపడలేదు. కాని ఆమె దానిని తన వద్దనే దాచుకొన్నది. హిందూ శాస్త్రములను మరియు అనేక పవిత్ర గ్రంథములను పఠించిననూ ఆమె హృదయము అసంతృప్తితో నిండియుండేది. ఎందుకనగా వాటిలో స్త్రీలకు మత సంబంధముగా ఎటువంటి నిరీక్షణ లేదు. ఆమెలో దేవునిని తెలిసికొనవలెనను కోరిక అధికము కాసాగెను. ఆమె తన పూర్వీకుల సనాతన ఆచారములు, సాంప్రదాయముల పట్ల విశ్వాసమును కోల్పోయెను. ఆమె శూద్ర కులమునకు చెందిన ఒక బెంగాలీ యువకుని తన ఇరవై రెండవ ఏట వివాహము చేసుకొనెను. 


    క్రీస్తు వైపునకు తిరుగుట :

    అస్సాములో ఆమె తన భర్తతో కలిసి జీవింపసాగింది. ఆమె ఒకనాడు బెంగాలీ భాషలో రచించబడిన చిన్న పుస్తకమును చూసింది. ఎంతో అభిరుచితో ఆ పుస్తకమును పఠించింది. అది లూకా సువార్త. ఆమెను ఒక క్రైస్తవ మిషనెరీ కూడా క్రమముగా దర్శించి అనేక బైబిల్ వృత్తాంతములను వినిపించెను. ఆమె క్రైస్తవ బోధల పట్ల ఆకర్షితురాలగుట ఆమె భర్త సహించలేకపోయాడు. రెండు సంవత్సరములు దాంపత్య జీవితమును గడిపిన పిమ్మట ఆమె భర్త కలరా వ్యాధికి గురై మరణించాడు. ఆ విధముగా ఆమె బహు చిన్న ప్రాయములోనే విధవరాలిగా మారింది.

    ఆమెకు మనోరమ అను ఒక కుమార్తె జన్మించింది. ఆమె తన భర్త మరణానంతరము తన కుమార్తెను తీసుకొని పూనా పట్టణము చేరింది . అక్కడ కూడా ఆమె క్రైస్తవ్యమును క్రైస్తవ మిషనెరీల నుండి తెలిసికొనుటను కొనసాగించింది.


    ఇంగ్లండు దేశ ప్రయాణము:

    భారత దేశములోని స్త్రీలను ఉద్ధరించవలెనన్న తనకు మరియెక్కువ విద్య మరియు శిక్షణ అవసరమని గుర్తించింది. కనుక 1883లో ఆమె తన కుమార్తెను తీసుకొని ఇంగ్లండు దేశమునకు వెళ్ళింది. అక్కడ ఆమెకు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ (Church of England) కు చెందిన సహెూదరీల సహవాసము దొరికింది. వారి సహవాస ఫలితముగా ఆమె క్రైస్తవ బోధలచే ప్రభావితము కాగలిగింది. ఆమె అనేక సహెూదరీల ఆశ్రమములను దర్శించింది. వారి పనిని గమనించి  సంఘములో వెలివేయబడిన, హీన స్థితిలో వున్న స్త్రీలకు ఏ విధముగా సహాయము చేయవలెనో తెలిసికొనగలిగింది. వారి జీవితములలో క్రీస్తు తీసుకొని వచ్చిన మార్పును కూడా ఆమె గమనించగలిగింది. ఆయన మాత్రమే హిందూ దేశములోని స్త్రీల జీవితములలో కూడా మార్పును తేగలరని ఆమె విశ్వసించింది.


    మారుమనస్సు పొందుట :

    ఆ విధముగా ఆమె హృదయము క్రైస్తవ మతమువైపు ఆకర్షింపబడింది. ఆమె బాప్తీస్మము తీసుకొని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారిచే నిర్ధారింపబడింది. కాని ఆమె క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరింపలేదు. కనుక ఆమె హృదయ వాంఛ యింకనూ తీరకనే యుండెను. ఆమె అమెరికా దేశమును దర్శించి, అనేక స్థలములలో ప్రసంగించింది. ఆమె ఇండియా దేశమునకు తిరిగి వచ్చినప్పుడు ఎంతో నమ్మకముగా బైబిల్ను తిరిగి పఠించుట ఆరంభించెను. కొన్ని దినముల తర్వాత ఆమే స్వయముగా ఆ విషయమై ప్రస్తావిస్తూ ‘(క్రైస్తవ మతమును ఎరిగియుంటిని, కాని ఆ మతమునకే జీవమైన క్రీస్తును కనుగొనలేకుంటిని' అని పలికెను. ఆమె తన ఆత్మీయ జీవితము పట్ల అసంతృప్తి కలిగియుండేది. చివరకు పరిశుద్ధాత్మచే నడిపింపబడినదై, దేవుని వాక్యము ద్వారా ఆమె క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరింపగలిగింది. మరియు రక్షణ యొక్క నిశ్చయతను సంపాదించుకొన్నది.


    "శారదా సదన్" ను స్థాపించుట :

    క్రీస్తును ఎరిగిన తరువాత ఆయన సేవ చేయవలెనను గొప్ప ఆశను రామాబాయి కలిగియుండేది. జాన్ పేటన్, హడ్సన్ టేలర్ వంటి మిషనెరీల జీవితములు ఆమెను ఎంతో ప్రభావితము చేసాయి. ఆమె విశ్వాసముతో పరిచర్యను భారతదేశములో ఆరంభించుటకు సవాలు చేయబడింది.

    దేవుని పైననే అన్ని అవసరాలకు ఆధారపడుచూ, ఇండియాలోని విధవరాండ్రైన స్త్రీలను మరియు అనాథ బాలలను పాపపు జీవితము మరియు దానివలన వచ్చు అపవాదుల నుండి రక్షించి క్రీస్తు యొద్దకు వారిని నడిపించులాగున వారి నిమిత్తమై ఏదైననూ చేయవలెనను నిర్ణయమును తీసుకొన్నది. దాని మూలముగా ఒక ఆశ్రయ గృహము పూనా పట్టణములో స్థాపించబడింది. దానికి శారదా సదన్ (Sarada Sadan) అని నామకరణము చేసింది. అగౌరవపరచబడినవారు, వెలివేయబడినవారు, ఆకలికి అలమటించేవారు ఆ గృహమునకు ఆహ్వానింపబడ్డారు. ఆ గృహములో నివసించే స్త్రీలు అనేక చేతిపనులు చేయుట, ఏదైనా ఒక వృత్తి విద్యలో అభ్యాసము మున్నగు వాటిలో శిక్షణ నొందుట వలన వారి కాళ్లపై వారు నిలబడుటకు అవకాశము కలిగింది. అనేకమంది అనాథ బాలికలు, వెలివేయబడిన స్త్రీలు ఆ గృహములో చేరారు. వారిని రామాబాయి ఎంతో దయతో, ప్రేమతో చేరదీసేది. వారు ఆమెను తల్లివలె ప్రేమించేవారు. ఆమె తల్లివలెనే కాక, స్నేహితురాలిగా, బోధకురాలిగా వారితో మెలిగేది. ఆమె ఎవరినీ క్రీస్తును అంగీకరించుమని ఒత్తిడి చేసెడిది కాదు. కాని ఆమె వద్ద నుండి క్రీస్తును తెలిసికొనినవారు, ఆమె యొక్క జీవితమును, ప్రేమను అనుభవపూర్వకముగా తెలుసుకొనిన అనేకులు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిరి.

    ఆలయములలో దేవదాసీలుగా వుంటూ బలవంతముగా పాప భరితమైన జీవితములోనికి ఈడ్చబడు అనేక ఆలయ బాలికలు, స్త్రీలు రామాబాయిచే రక్షించబడిరి. వారిలో అనేకులు శారదా సదనములో చేర్చబడిరి. ఒకమారు ఆమె ఒక బీద యాత్రికురాలివలె మారువేషము వేసుకొని బృందావనము అని పిలువబడు ప్రదేశములో పూజారుల వద్ద దాసీలుగా వున్న అనేకమంది బాలికలను, స్త్రీలను రక్షించి వారిని వెలుపలికి తీసుకొని రాగలిగెను. అటువంటివారు ఏ విధముగానైనా ఆ చెర నుండి తప్పించుకొని వచ్చిన, శారదా సదనము వారికి ఆశ్రయమివ్వగలదని ఆమె వారికి తెలియజేసింది.

    ఆమె అనేక గ్రామములకు ఎడ్ల బండిపై వెళ్లి అక్కడి వారికి సువార్తను బోధించేది. అవసరమైన వారికి ఆహారమును, దుస్తులను పంచిపెట్టేది. ఈ పరిచర్య అంతటికిని కావలసిన ధనముకై ఆమె దేవునిపై మాత్రమే ఆధారపడేది. ఆమె అనేక ఆలయ బాలికలను కాపాడినందులకు హిందూ పూజారులు ఆమెపై ఆగ్రహించి ఆమెను వ్యతిరేకించారు.

    ఒకమారు గుజరాత్ నకు  చెందిన ఒక బాలిక దుష్టాచారులు వద్దనుండి రక్షించబడి బొంబాయిలోని ఒక హాస్పిటల్లో చేర్పించబడింది. వారు ఆమెను కనుగొని తిరిగి తమతో రావలసినదిగా బలవంతపెట్టారు. కాని, ఆ బాలిక అట్లు వెళ్లినచో వారు కొట్టు దెబ్బలకు భయపడి వెళ్లుటకు నిరాకరించింది. వారు ఆమె తప్పించుకొని పోకుండ దివారాత్రములు హాస్పిటల్ చుట్టూ కాపలా కాసారు. కాని రామాబాయి ఒక స్నేహితురాలి సహాయముచే ఆ బాలిక తప్పించుకొని శారదా సదనము చేరగలుగునట్లుగా చేసింది.

    రామాబాయి యొక్క కీర్తి ఇండియా అంతటా మరియు యితర దేశములకునూ వ్యాపించింది. సరోజినీ నాయుడు వంటి భారత నాయకులు ఆమెను గుర్తించి భారతదేశపు గొప్ప బిడ్డగా అభివర్ణించారు. యితర దేశముల వారునూ సహాయ సహకారములు అందించుట ప్రారంభించారు.


    "ముక్తి మిషన్" ను స్థాపించుట:

    రామాబాయి యొక్క సేవ వర్థిల్లుచూ శారదా సదనమును ఆశ్రయించువారికి స్థలము లేనంతగా విస్తరించింది. కనుక ఆమె పూనాకు సమీపములో ఖేడ్గావ్ అను ప్రాంతములో శారదా సదనము వలె నుండు మరియొక గృహమును నిర్మించి దానికి 'ముక్తి' అని పేరు పెట్టింది. దీనిని అభివృద్ధి చేయుటకై ఆమె ఎంతగానో ప్రార్థించింది. ఇక్కడికి వచ్చు బాలికలు కూడా ఏదో ఒక విద్యలో శిక్షణ పొందెడివారు. ఆ విధముగా వారు స్వయం ఉపాధిని పొందగలిగేవారు. వారిలో అనేకులు నర్సులుగా, నేత పనివారుగా, బైబిల్ టీచర్లుగా, గృహ సంరక్షకులుగా రూపుదిద్దబడ్డారు. ఒక బాలిక ముక్తి నుండి క్రొత్త జీవితమును ప్రారంభించుటకు బయటకు రాగానే వేరొకరితో ఆ స్థలము పూరించబడేది.

    మధ్య భారతదేశములో గొప్ప కరువు వచ్చినది. అనేకులు ఆకలి బాధతో మరణింపసాగారు. రామాబాయి తన చిన్నతనములో కరువు బారిన పడిన సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకొని వారికి సహాయము చేయుటకై ముందుకు వచ్చింది. 300 మంది బాలికలు ఆమెచే సహాయము పొందుటకై వచ్చారు. ఆమె వారికి ఏమి చేయగలదు? అప్పటికే ముక్తి సదన్ కూడా నిండిపోయింది. ఆమె అవసరతల విషయమై బహుగా ప్రార్థించి. ఈ విషయమై అనేకులకు లేఖల ద్వారా విన్నవించింది. వెంటనే క్రైస్తవులు అనేకులు స్పందించి వారి సహాయమును పంపిరి. ఆ విధముగా ఆ బాలికలకు సరిపడు ధనమును ఆమె సకాలములో పొందగలిగింది.

    ముగింపు:

    రామాబాయి ఎప్పుడూ క్రొత్త పరిచర్యలో నిమజ్ఞమై యుండెడిది. ఆమె తరచుగా ప్రయాణించుచూ, బోధించుచూ గడిపెడిది. ఆమె మరాఠీ భాషలో అనేక పాటలను కూడా రచించింది. దీనకరమైన జీవితము నుండి ప్రారంభించి రెండు పెద్ద ఆశ్రమములను నెలకొల్పగలిగింది. ఒక్క ముక్తి ఆశ్రమములోనే రెండు వేల వరకు బాలికలు, స్త్రీలు ఆశ్రయము పొందగలిగారు. వంద మంది ఆమెకు సహాయకులుగా ఉండేవారు. 1922వ సంవత్సరము రామాబాయి ఈ లోకములో తనకిచ్చిన కార్యక్రమములు నెరవేర్చి ఆయన ఉన్నత బహుమతి పొందుటకై వెళ్ళిపోయింది. కాని, ఆమె పరిచర్య మిగిలే ఉన్నది. ఈ దినమున కూడా ముక్తి మిషన్ వారి ఆధ్వర్యమున నిరాశ్రయులైన ఎందరో బాల బాలికలు సహాయము పొందగలుగుచున్నారు. రామాబాయి యొక్క విజయము ఆమె పరిచర్య అనేకులను ఆశ్చర్యపరిచేది. ఒక బ్రాహ్మణ విధవరాలు తన స్వంత వారిచే వెలివేయబడినప్పటికిని దేవుని కొరకు, సమాజము కొరకు అంత సేవ ఏ విధముగా చేయగలిగింది? దాని రహస్యము ఏమనగా - ఆమె తన ఒక్కగానొక్క జీవితమును క్రీస్తు చేతులకు సమర్పించింది. ఆయన యిచ్చిన బలముతోనే సమస్తము సాధ్యమయ్యింది. రామాబాయి ఈ విధముగా పలికేది  - 'దేవుడు నాకు ఏమి చేసెనో, ఆయన మీకునూ ఆలాగున చేయగలరు'.






    Quotes from Famous Scientists about God

    • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
    • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
    • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
    • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

    Today's Verse

    Systematic Theology in Telugu

    Visit Elselah Book House


    Total Pageviews