బాల్యము -కుటుంబ నేపథ్యము
ఎలోయిస్ ఉత్తర కెరోలీనా లోని మర్ఫీ లో ఆగష్టు10,1910 లో జన్మించింది. ఆమె తండ్రి ఆల్ఫ్రెడ్ అన్ ఫెయిన్. తల్లి ఇడా ఫిలిప్స్. ఎలోయిస్ అందరికన్నా చిన్నది.చిన్నప్పుడు ఎంతో అనారోగ్యంతో బాధపడింది. ప్రకృతిని ఎంతో ప్రేమించేది ఎలోయిస్. మేఘాలలో ఆమె ఒక దర్శనాన్ని చూసింది. యేసు ప్రభువు మరియు ఆయనను వెంబడిస్తున్న గొర్రె పిల్లలు. ఆ దర్శనములో యేసు ఆమెకు తన చేతిలో వున్న గొర్రె పిల్లను చూపారు. దేవునితో గల ఆత్మీయ సంబంధము,క్షేమము,భద్రత ,తన భవిష్యత్తు పరిచర్యను ఈ దర్శనము తెలియజేయుచున్నది. వారి కుటుంబములో కలిగిన ఆర్ధిక లోటును తీర్చడానికి ఎలోయిస్ తల్లి ఒక వసతిగృహమును నడిపేది. అక్కడ ప్రయాణీకులకు ఆతిధ్యం ఇచ్చేవారుఎలోయిస్ తన అక్కతో కలిసి రైల్వేస్టేషన్ కి వెళ్ళి ప్రయాణీకులను ఆహ్వానించేది. ఎలోయిస్ అక్క ఆమెను 'వీజీ' అని పిలిచేది. ఎలోయిస్ కి నాట్యము మరియు నటించడం అంటే ఎంతో ఇష్టం. నర్తకిగా ఆమె ఎన్నో బహుమతులు పొందింది. ఎలోయిస్ మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రజలకు సేవ చేసేది. సండేస్కూలు టీచరుగా భోదించేది. ఆ ప్రజలు చూడటానికి కఠినులుగా కనిపించినా వారి హృదయం ఎంతో మంచిదని ఆమె చెప్పేది. ఆతిధ్యము, కష్టపడి పనిచేసే స్వభావం ఆమె తన తల్లి దగ్గర వారసత్వంగా పొందింది.
రక్షణ - వేదాంత విద్యార్థినిగా
ఎలోయిస్ మెథడిస్ట్ చర్చిలో నామకార్ధ క్రైస్తవురాలిగా వుండేది. ఆమె లోకం లోని సంతోషాన్ని అనుభవించడానికి ఎంతో ఇష్టపడేది. 1928 లో ఆమె తన చర్చికి వచ్చిన ప్రసంగీకుడు భోదిస్తుండగా దేవునికి తన హృదయాన్ని సమర్పించింది. మార్పు చెందిన తరువాత కూడా ఆమె నాట్య కార్యక్రమాల్లొ పాల్గొంది. కాని 1కొరింధీ 3:16 "మీరు దేవుని ఆలయమైయున్నారనియూ ,దేవుడు మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా" అనే వాక్యము ద్వారా దేవుడు ఆమె తో మాట్లాడెను. తన పాస్టరు గారి సలహా చొప్పున ఎలోయిస్ కొలంబియా బైబిల్ కాలేజీలో వేదాంత విద్యను అభ్యసించడానికి నిర్ణయించుకున్నది. ఆమె తన శిక్షణాకాలంలో లోతైన ఆత్మీయ జీవితం కలిగి, గొప్ప సేవా జీవితం కొరకు దేవునిచే ఎన్నిక చేయబడినట్లుగా గుర్తించింది.
ఎలోయిస్ హాస్యాన్ని ఎంతో ఇష్టపడేది.ఆమె ఎప్పుడూ నవ్వుతూ చెప్తూ ,నవ్విస్తూ వుండేది.
ఆమె వ్యక్తులపై శ్రద్ధ చూపించేది.ఆమె ప్రేమతో ఎదుటి వారి సమస్యలను , భారాలను, భయాలను ,భాదలను ,కష్టాలను వినేది. ఎలోయిస్ ఎంతో నిరాడంబరంగా వుండేది. ఆమె తన గదిని తనకు వున్న సామగ్రితో ఎంతో అందంగా సర్దేది. ఆమె చీరకట్టు లో శ్రీమతి ఇందిరాగాంధీని పోలి వుందేది.ఆమె ఒక భారత స్త్రీలా ఎంతో సౌందర్యంగా వుండేది. భారత స్త్రీలలాగా పూర్ణహృదయముతో దేవుని ఏవిధంగా ఆరాధించాలో అమెరికా దేశస్థులు నేర్చుకోవాలని ఆమె అక్కడ జరిగిన ఒక సమావేశంలో చెప్పింది.
విలక్షణమైన వ్యక్తిత్వం
ఎలోయిస్ జీవితాన్ని ప్రేమించే వ్యక్తి. క్రైస్తవ జీవితం దుఃఖంతో మూల్గే శవ యాత్ర కాదు. ఉత్సాహంగా జరుపుకొనే ఒక ఉత్సవం లాంటిది. ఎలోయిస్ ఈ సత్యాన్ని తన జీవితం ద్వారా చూపించింది.
1928లో అమెరికా దేశానికి ఆర్ధిక సంక్షోభము ఏర్పడినపుడు ఆమె చర్చి లో యౌవన కార్యకర్తగా జీతం తీసుకోకుండా పరిచర్య చేసింది. ఆ సమయంలో దేవుడు ఆమె అవసరాలన్నీ తీర్చాడు. యౌవనస్తుల మధ్య ఆమె పనిచేస్తున్నపుడు దేవుడు ఆమెను ఎక్కడ సాక్ష్యం లేదో అటువంటి విదేశే పొలములో పని చేయాలని పిలుస్తున్నట్లుగా భావించింది.
వివాహం
ఎలోయిస్ తన జీవిత భాగస్వామి విషయంలో రెండు షరతులను పెట్టింది. ఆమె కంటే వయస్సులో చిన్నవాడు కాకూడదు. ఆమె కంటే ఎత్తు తక్కువ వుండకూడదు. డా.స్టెరెట్ గారు ఈ రెండింటిలో విఫలమయ్యారు. కాని దేవుని చిత్తము కోసము ఎలోయిస్ తన షరతులను దేవుని బలిపీఠం పై పెట్టింది. దేవుని చిత్తప్రకారం జూన్10,1938 న నార్టన్ స్టెరెట్ గారితో ఎలోయిస్ వివాహం జరిగింది. వారి వివాహం ఎంతో నిరాడంబరంగా , దేవునికి మహిమకరంగా జరిగింది. ఆమె పని చేసిన సంఘము వారు ఆమెకు కావలసిన వివాహ గౌనును బహూకరించారు.
స్టెరెట్ దంపతులు ప్రజ్వలిస్తున్న అగ్నిలా పరిచర్యలో ముందుకు సాగిపోయారు.వారిద్దరిదీ ఒకే దర్శనము. అకులా ప్రిస్కిల్ల వలె దేవుని రాజ్య వ్యాప్తిలో భాగస్వామ్యులుగా పనిచేశారు.
ఆమె నార్టన్ గారికి ఒక సహాయకురాలిగా వుండేది. నార్టన్ గారు లేనప్పుడు ప్రతీ పరిస్థితినీ చక్క బెట్టుటలో తగినంత కృషిచేసేది. అడ్మినిస్ట్రేషన్ అయినా , వంట పని అయినా , లెక్కలు వ్రాసే పని అయినా సందర్భానికి తగినట్టుగా భాద్యతను నిర్వర్తించేది. భర్త చేయు పరిచర్యను మోకాళ్ళ మీద ప్రార్ధనలో ఎత్తి పట్టుకొనేది. తన భర్త తప్పులను గమనించి ఆయనను సరిదిద్దేది. ఆమె తన భర్త లక్ష్యాలను నెరవేర్చుటలో తనను తాను పూర్తిగా సమర్పించుకొనిన మహిళ. ఆమె భర్త పరిచర్యకు గొప్ప సహాయకురాలేగాక చాల తెలివి కలిగి, ఆలోచన చెప్పగల స్త్రీ. ఎలోయిస్ నార్టన్ దంపతులు ఇద్దరు పిల్లలతో ఆశీర్వాదింపబడినారు. వారు గెరాల్డ్ మరియు ఆనీ. పిల్లలు మా హృదయాలకు సంతోషాన్ని ఇచ్చారు. ప్రజల హృదయ తలుపులు తెరవడానికి వారు మార్గమయ్యారు అని ఎలోయిస్ పలికేది.
"ఎలోయిస్ యేసు ప్రభువు ప్రేమ గురించి చెప్పలేదు. ఆమె యేసు ప్రభువు పేమను నా పట్ల చూపించింది. అది నా జీవిత నిర్దేశాన్ని మార్చుకోవడానికి, స్వస్థపడటానికి సహాయపడింది."అని కఠిన పరిస్థితులగుండా వెల్తున్న ఒక స్త్రీ ఎలోయిస్ చే కౌన్సిలింగ్ చేయబడిన తరువాత పలికింది.
ఆదర్శకరమైన జీవితం
ఎలోయిస్ వైవిధ్యం కలిగిన ఒక అరుదైన స్త్రీ .ఆమె ఎప్పుడూ ఇతరులకు గొప్ప మేలు జరుగుతుందనే ద్రుఢమైన విశ్వాసంతో వుండేది. ఆమె ఎంతో నిజాయితీ మరియు పారదర్శకత కలిగిన వ్యక్తి. ఎలోయిస్ వ్యక్తిగత శ్రద్ధ కలిగిన స్త్రీ. స్టడీ సెంటర్ లోని విద్యార్ధుల ఆత్మీయ ఎదుగుదల గురించి ఆమె గొప్ప ఆశ కలిగి వుండేది. వారికి ఆతిధ్యం ఇవ్వడం, ఆటలలో వారితో పాల్గోవటమే కాకుండా కొంత విలువైన సమయాన్ని వారితో గడిపేది. ఆమె ఎదుటి వారు ఆత్మీయంగా చిన్నవారైనా , పరిపక్వత చెందనివారైనా , తలాంతులున్నా లేకపోయినా వారిని గౌరవించేది. 'వస్తువులను ప్రేమించి మనుష్యులను ఎప్పుడూ ఉపయోగించుకోవద్దు, ఎప్పుడూ మనుష్యులను ప్రేమించి వస్తువులను వుపయోగించుకోండీ' అనే విషయాన్ని విధ్యార్ధులకు జ్ఞాపకం చేసేది.
ఆమె ఎవరిని తక్కువగా చూసేది కాదు. పదవి,డబ్బు, బలము లేని వ్యక్తులకు సమాజంలో విలువ వుండదు. కాని అలాటి వారికి కూడా ఎదో ఒక విధంగా పరిచర్య చేసేది. ఆమె ఎంతో చురుకైన , కపటము లేని యధార్ధమైన స్త్రీ.ఆమె ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొనేది. ఆమె మిక్కిలి దాతృత్వపు స్వభావము కలిగివుండేది. ఆమె రాబోవు పరిణామాల గురించి ఆలోచించకుండా హృదయపూర్వకంగా ఇచ్చేది. ఆమె మరణించే సమయానికి ఆమె దగ్గర కొన్ని అవసరమైన వస్తువులు మాత్రమే వున్నాయి. ఆమె ఇతరుల అవసరాలు తీర్చడానికి తనను తాను వినియోగించుకొన్నప్పుడు , దేవుడు ఆమె అవసరాలు తీర్చాడు. ఆమె ఎంతో చక్కగా భోదించేవారు. ఆమె ఎప్పుడూ పక్కాగా వాక్యాన్ని సిద్ధపరుచుకునేది. సమగ్రమైన వాక్య సిద్ధబాటు, గుంపుకు ఏమి అవసరమో అది భోదించునట్లు దేవుడు నడిపిస్తాడని నమ్మేది.
ముగింపు
1978 ఫిబ్రవరి 9 లో నార్టన్ గారి మరణము తరువాత ఎలోయిస్ ఒంటరిగా తన పోరాటం సాగించింది. దేవుని ద్రాక్ష తోటలో నాకు ఇంకా కొంత పని వున్నదని నేను నమ్ముతున్నానని ఆమె దేవుని హస్తాన్ని పట్టుకొని ముందుకు నడిచింది. ఆమె తన వృధాప్యంలో అసాధరణ వ్యాధితో భాధపడింది. అయినా ఆమె వీధులలో నడిచి వెళ్ళి అక్కడ వున్న ప్రతి ఒక్కరిని పలకరించేది. వ్యాధి ఆమె ఆత్మకు, చిరు నవ్వుకు ఇబ్బంది కలిగించలేదు.
1991,మే 6 న ఎలోయిస్ మరణించింది. ఆమె పౌలు వలె మంచి పోరాటము పోరాడినది. ఎప్పుడూ ధరించని , వాడబారని సౌందర్యవంతమైన నీతి కిరీటము ఆమె తలపై ఉంచబడినది. హైఫీల్డ్ స్టెరెట్ దంపతుల నిస్వార్ధ సేవకు సాక్షి. ఉన్నత భావాలతో , చాల సంవత్సరాలు చేసిన సేవ కోల్పోలేని వారసత్వంగా ఇంకా నేటికి వారి జ్ఞాపకార్ధంగా నిలిచే వున్నది.


No comments:
Post a Comment